
Naga Chaitanya Sobhita Dhulipala Wedding Video:
టాలీవుడ్ హీరో నాగ చైతన్య బాలీవుడ్-టాలీవుడ్ బ్యూటీ శోభిత ధూళిపాళ్ల వివాహం డిసెంబర్ 4, 2024 న అన్నపూర్ణ స్టూడియోస్ లో జరగడం పెద్ద సంచలనంగా మారింది. ఇది పూర్తిగా ప్రైవేట్ ఈవెంట్ గా జరగగా కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. అయితే, ఇప్పుడు ఈ పెళ్లి మరింత హాట్ టాపిక్ గా మారింది.
నాగ చైతన్య-శోభిత వివాహం ప్రైవేట్ గా జరిగినా, దీనికి సంబంధించిన వీడియోను నెట్‌ఫ్లిక్స్ ఫిబ్రవరి 14, 2025న స్ట్రీమ్ చేయనుందని టాక్. దీనికి సంబంధించి నెట్‌ఫ్లిక్స్ 50 కోట్లు వెచ్చించిందని వార్తలు వస్తున్నాయి. ఇది నిజమే అయితే, చైతూ తదుపరి సినిమా ‘థండేల్’ కంటే ఎక్కువ రేటుకి ఈ వెడ్డింగ్ వీడియో అమ్ముడైనట్లే!
View this post on Instagram
థండెల్ మూవీ OTT రైట్స్ Netflix 35 కోట్లకు కొనుగోలు చేసిందని సమాచారం.
వెడ్డింగ్ వీడియో రైట్స్ 50 కోట్ల డీల్ లో ముగిసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇది చూస్తే, స్టార్ హీరోల వ్యక్తిగత జీవితాలకు ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరిగినట్టు తెలుస్తోంది. సినిమా కంటే వారి వ్యక్తిగత కంటెంట్ కు ఎక్కువ డిమాండ్ ఉందని ఈ లెక్కలు చెబుతున్నాయి.
ఇప్పటికే నయనతార – విఘ్నేష్ శివన్ పెళ్లి డాక్యుమెంటరీ Beyond the Fairytale నెట్‌ఫ్లిక్స్ లో వచ్చి పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు నాగ చైతన్య – శోభిత ధూళిపాళ్ల డాక్యుమెంటరీ ఎంతవరకు హిట్ అవుతుందో చూడాలి.
ఇదిలా ఉంటే, నాగ చైతన్య ప్రస్తుతం తన లేటెస్ట్ మూవీ ‘థండేల్’ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. చందూ మొండేటి డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీ ఫిబ్రవరి 7, 2025 న విడుదల కానుంది. ఇందులో సాయి పల్లవి లీడ్ రోల్ లో నటిస్తోంది.
ALSO READ: బాక్స్ ఆఫీస్ వద్ద Thandel ఎంత వసూలు చేయాలంటే