HomeTelugu Big StoriesMegastar Chiranjeevi ఊటీ లో కొన్న ప్రాపర్టీ కి ఎంత ఖర్చయిందో తెలుసా?

Megastar Chiranjeevi ఊటీ లో కొన్న ప్రాపర్టీ కి ఎంత ఖర్చయిందో తెలుసా?

Guess how much Megastar Chiranjeevi spent for a 5.5 acre property in Ooty
Guess how much Megastar Chiranjeevi spent for a 5.5 acre property in Ooty

Megastar Chiranjeevi properties:

మెగాస్టార్ చిరంజీవి తెలుగు ఇండస్ట్రీలో అత్యంత ధనవంతులైన నటులలో ఒకరు. సినిమాలలో నటనతో పాటు, ఆయన చేసిన ఆర్థిక పెట్టుబడులు కూడా ఆయన సంపదను బాగానే పెంచాయి. చిరంజీవి రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టడం ద్వారా కూడా తన ఆర్థిక స్థితిని మరింత మెరుగుపర్చుకున్నారు.

హైదరాబాద్‌లో ఖరీదైన ఆస్తులతో పాటు, ఇటీవల చిరు ఊటీలో ఒక అందమైన స్థలాన్ని సొంతం చేసుకున్నారు. చిరంజీవి 5.5 ఎకరాల ఈ స్థలాన్ని ఏకంగా 16.5 కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారు. ఈ స్థలం పచ్చని కొండల మధ్యలో, తేయాకు తోటలతో చుట్టుముట్టి, అందమైన లోయ వ్యూ తో ఉంటుంది అని సమాచారం.

ఈ ప్రాంతంలో ఇప్పటికే పలువురు వ్యాపారవేత్తలు, సినీ ప్రముఖులు ఆస్తులను కొనుగోలు చేశారు. చిరంజీవి కుటుంబం కూడా ఇప్పుడు అదే మార్గంలో అడుగుపెట్టింది. రామ్ చరణ్, ఉపాసన కూడా ఈ స్థలాన్ని సందర్శించి, త్వరలోనే ఈ ప్రదేశంలో ఒక లగ్జరీ ఫామ్‌హౌస్ నిర్మించాలని నిర్ణయించారట.

దీనికి సంబంధించిన అనుమతులు ఇప్పటికే తీసుకున్నారని సమాచారం. ఇక సినిమాల పరంగా చూస్తే.. చిరంజీవి ప్రస్తుతం విశ్వంబర చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం 2025 క్రిస్మస్ సందర్భంగా విడుదల కానుంది.

Read More: SWAG సినిమా ఓటిటి విడుదల ఎందులోనో తెలుసా?

Recent Articles English

Gallery

Recent Articles Telugu