
MAD Square Target Collections:
‘మ్యాడ్’ సినిమాకు అద్భుతమైన విజయం రావడంతో దాని సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ భారీ స్థాయిలో రూపొందించారు. మొదటి భాగం కేవలం రూ.2.5 కోట్ల బడ్జెట్‌తో రూపొందినా, మౌత్ టాక్ వల్ల రూ.9.6 కోట్ల షేర్ రాబట్టి, ట్రిపుల్ లాభాన్ని అందుకుంది. అదే నమ్మకంతో, మేకర్స్ సీక్వెల్‌కు భారీగా ఖర్చు చేశారు.
సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ‘మ్యాడ్ స్క్వేర్’కు భారీ బిజినెస్ జరిగింది. ఈ సినిమా నైజాం ఏరియాలో రూ.6.5 కోట్లు, సీడెడ్‌లో రూ.2 కోట్లు, ఆంధ్రలో రూ.7 కోట్లు బిజినెస్ చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ.15.5 కోట్ల బిజినెస్ కాగా, ఇతర రాష్ట్రాల్లో రూ.2 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.3.5 కోట్ల బిజినెస్ సాధించింది. మొత్తం రూ.21 కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్ జరగడంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ మరింత పెరిగింది.
ఈ సినిమా పెట్టుబడిని రికవరీ చేయాలంటే రూ.22 కోట్ల షేర్ కలెక్ట్ చేయాల్సి ఉంది. కామెడీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా, ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. టైర్ 2 హీరోలున్న ఈ సినిమాకు ఈ స్థాయి టార్గెట్ చేరుకోవడం సులభం కాదు. అయితే, మంచి మౌత్ టాక్ వస్తే భారీ లాభాలు తెచ్చుకోవడం కష్టమేమీ కాదు.