USA Elections 2024:
డొనాల్డ్ ట్రంప్ 47వ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికై తిరిగి అధికారంలోకి వస్తున్నారు. తాజాగా జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో, ఆయన కమలా హారిస్‌పై ఘన విజయం సాధించారు. ఈ నేపథ్యంలో, ఎన్నో ప్రశ్నలు కూడా బయటకి వస్తున్నాయి. ముఖ్యంగా ట్రంప్ కి వచ్చే జీతం ఎంత అన్నది ప్రజలలో ఆసక్తిని కలిగిస్తోంది.
Donald Trump Salary:
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ కు ప్రతి సంవత్సరం $400,000 జీతం అందుతుంది. ఇది భారత రూపాయలలో సుమారుగా రూ. 3.3 కోట్లకు సమానం. ఈ మొత్తం ప్రపంచంలోని అతి శక్తివంతమైన వ్యక్తికి తగినంతగా అనిపించకపోయినా, అధికార స్థానం కలిగించే గౌరవం మరింత విలువైనది అని అనుకోవచ్చు.
జీతం కంటే ఎక్కువగా, అమెరికా అధ్యక్షుడికి అందే ప్రత్యేక అలవెన్సులు కూడా ఉన్నాయి. ప్రతిఒక్క అధ్యక్షుడికి $50,000 వ్యక్తిగత అవసరాల కోసం, అధికారిక విషయాల్లో ఉపయోగించేలా అనుమతించబడుతుంది. వీటితో పాటు, అధికారిక ప్రయాణాలకు $100,000 ప్రోత్సాహకం కూడా లభిస్తుంది.
అధ్యక్ష పదవి చేపట్టిన వెంటనే, వారు తమ సొంత రీతిలో వైట్ హౌస్ ని సర్దుబాటు చేసుకోవడానికి మరో $100,000 కూడా కేటాయిస్తారు. ఈ సదుపాయాలు అధ్యక్షుడి జీవితాన్ని మరింత సులభతరం చేయడానికి ఉపయోగపడతాయి.
అమెరికా అధ్యక్షుడి జీతాన్ని భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వేతనంతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ అని చెప్పవచ్చు. మోదీ సంవత్సరానికి సుమారుగా రూ. 20 లక్షలు మాత్రమే వేతనంగా పొందుతారు. కానీ, ప్రధానంగా ఇద్దరి వేతనాల కంటే ఉన్నత పదవులు, వారి స్థానానికి సంబంధించిన గౌరవం, పవర్ అనేవి మరింత ముఖ్యం.
ALSO READ: Bigg Boss 8 Telugu లో ఒక్కసారిగా ఓటింగ్ తారు మారైపోయిందిగా!