Alia Bhatt remuneration for Jigra:
అలియా భట్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘జిగ్రా’ బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాను దర్శకుడు వాసన్ బాలా తెరకెక్కించగా, ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్‌తో కలిసి అలియా భట్ ఈ సినిమాను సహనిర్మించారు. అయితే సినిమా విడుదలైనప్పటి నుంచి థియేటర్లలో ఆశించిన స్పందన రాకపోవడం గమనార్హం.
తాజా సమాచారం ప్రకారం, ‘జిగ్రా’ చిత్రానికి మొత్తం రూ. 80 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన సినిమా. కానీ ఈ సినిమా విడుదలైన తర్వాత ఇప్పటివరకు కేవలం రూ. 20 కోట్ల వసూళ్లను మాత్రమే సాధించిందని వార్తలు వెలువడుతున్నాయి. ఈ భారీ బడ్జెట్ చిత్రం కోసం అలియా భట్ కూడా తన పారితోషికంగా భారీ మొత్తం అందుకున్నారు. ఆమె ఈ సినిమా కోసం ఏకంగా రూ. 15 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇది ఒక ఫిమేల్ సెంట్రిక్ పాత్రకు చాలా పెద్ద పారితోషికంగా చెప్పొచ్చు.
సినిమాలో తెలుగు నటుడు రాహుల్ రవీంద్రన్ కీలక పాత్రలో నటించగా, మరో ప్రధాన పాత్రలో వెదాంగ్ రైనా కనిపించారు. ఈ సినిమా యాక్షన్ డ్రామాగా తెరకెక్కింది. అయితే ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవాలనుకున్న ఈ సినిమా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో విఫలమైందని చెప్పుకోవచ్చు.
ఇప్పటికీ సినిమా పెద్దగా వసూళ్లను రాబట్టకపోవడంతో, నిర్మాతలు ఆందోళన చెందుతున్నారు. సినిమా విడుదలైనప్పటి నుంచి ప్రమోషన్లు కూడా చాలా నిర్వహించినా, పెద్దగా ఆశించిన ఫలితాలు రాలేదు.
Read More: Vishwambhara రిలీజ్ వాయిదా వెనుక అసలు సీక్రెట్ ఏమిటో తెలుసా?