2024 Cybercrimes in Hyderabad:
హైదరాబాద్ నగరంలో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. 2024లో ప్రజలు సుమారు ₹1866 కోట్ల మేరకు డబ్బు కోల్పోయారని తాజా నివేదికలు తెలియజేస్తున్నాయి. అయితే, పోలీసులు ఇందులో కేవలం ₹176 కోట్ల మాత్రమే తిరిగి రికవర్ చేయగలిగారు.
సైబర్ నేరాల కారణంగా ప్రజలు స్టాక్ స్కాములు, పార్ట్ టైం జాబ్ స్కాములు, డిజిటల్ అరెస్టులు, ఫేక్ కస్టమర్ కేర్, డెబిట్ మరియు క్రెడిట్ కార్డ్ స్కాముల ద్వారా డబ్బు కోల్పోయారు. తెలంగాణ వ్యాప్తంగా 1.14 లక్షల ఫిర్యాదులు నమోదయ్యాయి. ఎక్కువ కేసులు సైబరాబాద్ (25,112), హైదరాబాద్ (20,299), రాచకొండ (14,815), వరంగల్ (3531), సంగారెడ్డి (3132) ప్రాంతాలలో నమోదయ్యాయి.
The total reported crimes in #Cyberabad Police Commissionerate in 2024 are 37,689, which is high compared to crimes recorded in 2023 i.e. 29,156.
As many as 11,914 cases of cyber crime were registered in 2024 as against 5,361 in 2023. Among them, as many as 3,267… pic.twitter.com/W9Z91epMSz
— NewsMeter (@NewsMeter_In) December 24, 2024
గత సంవత్సరంతో పోలిస్తే సైబర్ నేరాలు 18% మేర పెరిగాయి. 2023లో 16,339 FIRలు నమోదవగా, 2024లో ఆ సంఖ్య 24,643కి పెరిగింది. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఏడాది 14,984 సిమ్ కార్డులు, 9,811 IMEI నంబర్లు, 1,825 వెబ్‌సైట్లను బ్లాక్ చేశారు.
అధికారులు ఈ నేరాలను అరికట్టడానికి చర్యలు తీసుకుంటున్నప్పటికీ, తక్కువ శాతం మాత్రమే కోల్పోయిన డబ్బును తిరిగి పొందడంలో విజయవంతమవుతున్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండి, డిజిటల్ ఫ్రాడ్‌ల నుండి తమను తాము రక్షించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ALSO READ: Sookshmadarshini సినిమా ఓటిటి లోకి ఎప్పుడు వస్తుందంటే!