Piracy in Film Industry:
ఇండియన్ ఎంటర్‌టైన్‌మెంట్ పరిశ్రమ 2023లో పైరసీ కారణంగా భారీ నష్టాన్ని చవిచూసింది. ఇంటర్నెట్, మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (IAMAI) తాజా నివేదిక ప్రకారం, పైరసీ వల్ల మొత్తం 22,400 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. ఇందులో 13,700 కోట్ల రూపాయలు థియేటర్‌లో విడుదలైన సినిమాల వల్ల, 8,700 కోట్ల రూపాయలు OTT ప్లాట్‌ఫార్మ్‌ల వల్ల నష్టపోయారు. పైరసీ వల్ల ప్రభుత్వానికి కూడా 4,300 కోట్ల రూపాయల GST ఆదాయం నష్టం సంభవించింది.
భారతీయ డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్ పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందుతోంది, 2026 నాటికి ఈ రంగం 14,600 కోట్ల రూపాయలకు చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే, పైరసీ కారణంగా ఈ వృద్ధికి తీవ్రమైన సవాళ్లు ఎదురవుతున్నాయి. పరిశ్రమ నిపుణులు, ప్రభుత్వం, వినియోగదారులు కలిసి పైరసీకి వ్యతిరేకంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి.
పైరసీని అనుసరించే వారి ప్రధాన కారణాలు మితిమీరిన సబ్‌స్క్రిప్షన్ ఫీజులు, కంటెంట్‌ను సులభంగా పొందలేకపోవడం, అనేక సబ్‌స్క్రిప్షన్‌లు నిర్వహించడంలో వచ్చిన అసౌకర్యం అని నివేదిక తెలిపింది. పైరసీ ఎక్కువగా 19 నుండి 34 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన యువతలో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ నడుమ మహిళలు ఎక్కువగా OTT షోలను, పురుషులు పాత సినిమాలను పైరసీ కంటెంట్‌గా చూడడం జరిగింది.
మరింతగా, పైరసీ కంటెంట్‌ను ఉపయోగించే వారిలో 64% మంది, ఆప్షన్ ఉచితంగా ఉంటే, లీగల్ కంటెంట్‌కి మారతామని తెలిపారు, యాడ్స్ ఉన్నా , కూడా పరవాలేదని పేర్కొన్నారు. పైరసీ కంటెంట్‌ను ఉపయోగించే వారిలో 70% మంది ఏ సబ్‌స్క్రిప్షన్‌కి అయినా చెల్లించడానికి ఇష్టపడటం లేదు. నివేదిక ప్రకారం, పైరసీ ఎక్కువగా రెండవ స్థాయి పట్టణాల్లో, మొదటి స్థాయి పట్టణాల కంటే విస్తృతంగా ఉంది.
ALSO READ: వైఎస్ జగన్ మీద కౌంటర్లు వేసిన Sree Vishnu