HomeTelugu Newsఓటీటీలో 'గూడుపుఠాణి'

ఓటీటీలో ‘గూడుపుఠాణి’

Guduputani movie ott releas
టాలీవుడ్‌ హాస్య నటుడు సప్తగిరి, నేహా సోలంకి జంటగా నటించిన చిత్రం ‘గూడుపుఠాణి’. కె.యమ్. కుమార్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాను ఎస్ఆర్ఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో రియల్ ఎస్టేట్ కింగ్స్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, కటారి రమేష్ నిర్మించారు. ఈ సినిమా గతేడాది డిసెంబర్ 25న థియేటర్లలో విడుదలై మంచి విజయం సాధించింది. సప్తగిరి కామెడీ డైలాగులు, మంచి కథ కథనంతో ప్రేక్షకులని ఎంటర్టైన్ చేసింది. నిర్మాతలైన పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, కటారి రమేష్ లకు మంచి డబ్బు సంపాదించి పెటింది. ఇప్పుడు ఈ “గూడుపుఠాణి” చిత్రం జీ 5 ఓటీటీ లో రేపు (8 జులై) నా విడుదల కానుంది.

నిర్మాతలు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, కటారి రమేష్ లు మాట్లాడుతూ.. “మా గూడుపుఠాణి చిత్రం మంచి విజయం సాధించింది. థియేటర్ లో చుసిన ప్రతి ప్రేక్షకుడు సినిమా చాలా బాగుందని కొనియాడాడు. మా చిత్రానికి మంచి రివ్యూస్ వచ్చాయి. IMDB లో 8.8 రేటింగ్ వచ్చింది. మా చిత్రాన్ని జీ5 వాళ్ళు మంచి రేట్‌కు కొన్నారు. రేపు జీ5లో విడుదల అవుతుంది. థియేటర్‌లో మిస్ అయినా ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇప్పుడు జీ 5లో లభిస్తుంది, చూసి ఆనందించండి” అని తెలిపారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu