పలువురు సినీ ప్రముఖల ఇళ్లలో జీఎస్టీ అధికారులు మంగళవారం దాడుల చేపట్టారు. టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ దర్శకుల, నిర్మాతల ఇళ్లలో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. మొత్తంగా 15 మంది ప్రముఖుల ఇళ్లలో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. అలాగే ప్రముఖ బిల్డర్స్, స్టీల్ వ్యాపారులు, ఫైనాన్స్ సంస్థలపై సోదాలు జరుగుతున్నాయి. ఆదాయం తక్కువగా చూపి ప్రభుత్వానికి ట్యాక్స్ ఎగ్గొట్టారనే ఆరోపణలు రావడంతో అధికారులు ఈ సోదాలు నిర్వహిస్తున్నట్టుగా సమాచారం.