నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’. నటుడిగా బాలయ్యకు, దర్శకుడిగా క్రిష్ కు ఈ సినిమా మంచి పేరును తెచ్చిపెట్టాయి. బాలయ్య అభిమానులను సంక్రాంతి సంబరాల్లో ముంచెత్తుతూ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. కలెక్షన్స్ లోనూ అదే వీరత్వాన్ని ప్రదర్శిస్తోంది. ఆడియన్స్ పై ఈ సినిమా ఎంతగా ఇంపాక్ట్ చూపించిందంటే సినిమాలో బాలయ్య చెప్పిన డైలాగ్స్ ను చెప్పడానికి ఇప్పుడు అందరూ ప్రయత్నిస్తున్నారు.
దాదాపు 18 కోట్ల ఓపెనింగ్స్ తో ఈ సినిమా మొదలైంది. వీకెండ్.. అందులోనూ సంక్రాంతి పండగ దీంతో కలెక్షన్స్ మరింత పెరిగాయి. మూడవ రోజుకి మొత్తం 48 కోట్లు కలెక్షన్స్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. బీ, సీ సెంటర్స్ కంటే మల్టీప్లెక్స్ లలో ఈ సినిమా బాగా ఆడుతోంది. తన ప్రతి చిత్రంతో ప్రత్యేకతను చాటే క్రిష్ మరోసాయి తెలుగు సినిమా స్థాయిని పెంచే సినిమాను రూపొందించాడు.