HomeOTTGorre Puranam సినిమా ఇంత త్వరగా ఓటిటిలోనా?

Gorre Puranam సినిమా ఇంత త్వరగా ఓటిటిలోనా?

Gorre Puranam locks its OTT release date
Gorre Puranam locks its OTT release date

Gorre Puranam OTT:

సుహాస్ తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు, ప్రస్తుతం జనక ఐతే గనక సినిమా విజయంపై ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే, సుహస్ ఈ మధ్యనే హీరోగా నటించిన గొర్రె పురాణం సినిమా.. బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశ కలిగించింది.

బాబీ దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి అంచనాల మధ్య విడుదలైనప్పటికీ.. ప్రేక్షకుల నుండి మంచి స్పందన తెచ్చుకోలేకపోయింది. కానీ, ఈ సినిమాకు ఓటీటీ వేదిక మీద మంచి రీచ్ ఉండొచ్చని దర్శక నిర్మాతలు ఆశిస్తున్నారు. అహా ఓటీటీ ప్లాట్‌ఫారమ్ లో ఈ సినిమా అక్టోబర్ 10, 2024న స్ట్రీమింగ్ కి సిద్ధంగా ఉంది.

ఈ సందర్బంగా ఆడియెన్స్ నుండి వచ్చే స్పందన కీలకంగా మారనుంది. ప్రేక్షకుల ఆదరణతో ఈ సినిమా ఓటీటీలోనైనా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందేమో చూడాలి.

ఇందులో ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ప్రముఖ దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ చిత్రంలో గొర్రె పాత్రకు తన గొంతు అందించారు. ఇది సినిమాకు ఒక ప్రత్యేక ఆకర్షణగా మారింది. అలాగే, పవన్ చే ఈ చిత్రానికి సంగీతం అందించారు. గొర్రె పురాణం సినిమాను ఫోకుల్ వెంచర్స్ నిర్మాణ సంస్థ నిర్మించింది.

ఈ సినిమా కథా, కథనం, నటనతో పాటు, దర్శకుడి ఊహాశక్తి చాలా కొత్తగా ఉన్నాయని ప్రేక్షకులు కామెంట్ చేస్తున్నారు. ఓటీటీ వేదికపై ప్రేక్షకులు సినిమాను ఎలా స్వీకరిస్తారో చూడాలి.

Read More: Spirit సినిమాలో కనిపించనున్న మెగాస్టార్?

Recent Articles English

Gallery

Recent Articles Telugu