లౌక్యం సినిమా తర్వాత సరైన సక్సెస్ లేని హీరో గోపిచంద్ గతేడాది చేసిన పంతం సినిమాతోనూ హిట్టు కొట్టలేకపోయాడు. తాజాగా ఈ యాక్షన్ హీరో తిరు దర్శకత్వంలో చాణక్య సినిమా చేస్తున్నాడు. పూర్తి యాక్షన్, మాస్ ఎంటర్‌టైనర్‌గా టెర్రరిజమ్ బ్యాక్ డ్రాప్‌లో సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో గోపీచంద్ ‘రా’ ఏజెంట్‌గా కనిపించబోతున్నాడు. మెహ్రీన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ హీరోకి మాస్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా దసరాకు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది.
గోపీచంద్ హీరోగా బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మాణంలో మరో సినిమా తెరకెక్కబోతుంది. ఈ సినిమాతో సుబ్రహ్మణం అనే కొత్త దర్శకుడు పరిచయం అవుతున్నాడు. పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ మూవీ త్వరలోనే పట్టాలెక్కబోతుంది. దర్శకుడు సంపత్ నందితో మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు గోపిచంద్. వీరిద్దరి కాంబినేషన్లో గతంలో గౌతమ్ నందా వచ్చింది. అయితే అది నిరాశపరిచింది. అయినప్పటికీ కథ మీదున్న నమ్మకంతో మళ్ళీ సంపత్ నందికి ఛాన్స్ ఇచ్చాడు.
ఈ మూవీ తర్వాత బిను సుబ్రహ్మణ్యం దర్శకత్వంలో బి.వి.యస్.ఎన్.ప్రసాద్ నిర్మాణంలో కొత్త సినిమాకు సైన్ చేసాడు. ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లక ముందే గోపిచంద్..సంపత్ నంది దర్శకత్వంలో మరో సినిమాకు ఓకే చెప్పాడు. అంతేకాదు ఈ సినిమాకు సంబంధించి ప్రకటన కూడా విడుదల చేశారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.