HomeTelugu NewsGopi Thotakura: అంతరిక్షంలోకి వెళ్లనున్న తొలి తెలుగు కుర్రాడు

Gopi Thotakura: అంతరిక్షంలోకి వెళ్లనున్న తొలి తెలుగు కుర్రాడు

Gopi Thotakura 1 Gopi Thotakura,vijayawada,space,indianGopi Thotakura: అంతరిక్షంలోకి వెళ్లాలని చాలా మంది కలలు కంటారు. అయితే అన్ని అర్హతలూ ఉన్నా కూడా మరికొందరు ఆ అవకాశం కోసం ఏళ్ల తరబడి వేచి ఎదురు చూస్తూ ఉంటారు. ఇక ఇప్పటివరకు మన దేశం నుంచి చాలా మంది ఇప్పటివరకు స్పేస్‌లోకి వెళ్లి వచ్చారు. తాజాగా మన తెలుగు కుర్రాడు అంతరిక్షయానం చేసేందుకు రెడీ అయ్యాడు.

ఇప్పటివరకు తెలుగువారు ఎవరూ స్పేస్‌లో అడుగుపెట్టలేదు. తొలిసారి గోపిచంద్‌ తోటకూర ఈ రికార్డు సృష్టించనున్నారు. ఈ అరుదైన రికార్డును సొంతం చేసుకోబోయే వ్యక్తి ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో పుట్టిపెరిగిన గోపీచంద్ తోటకూర అమెరికాలో నివాసముంటున్నారు. ఈయన అంతరిక్షంలోకి వెళ్లే తొలి తెలుగు వ్యక్తిగా రికార్డుల్లోకి ఎక్కబోతున్నాడు.

ఎన్‌ఎస్‌-25 మిషన్‌ పేరుతో చేపట్టనున్న అంతరిక్ష యాత్రకు ఆరుగురిని ఎంపిక చేసినట్టు బ్లూ ఆరిజిన్‌ సంస్థ ప్రకటించింది. ఇందులో గోపీచంద్‌ తోటకూర ఒకరు. అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌కు చెందిన ప్రైవేటు అంతరిక్ష సంస్థ బ్లూ ఆరిజిన్‌. ఈ కంపెనీ ఇప్పటికే న్యూ షెపర్డ్‌ మిషన్‌ పేరిట అంతరిక్ష యాత్రలకు శ్రీకారం చుట్టింది.

Gopi Thotakura Gopi Thotakura,vijayawada,space,indian

ఎన్‌ఎస్‌-25 మిషన్‌కు గోపీచంద్‌ సహా మొత్తం ఆరుగురిని ఎంపిక చేశారు. వెంచర్‌ క్యాపిలిస్ట్‌ మాసన్ ఏంజెల్, ఫ్రాన్స్‌ ఔత్సాహిక పారిశ్రామికవేత్త సిల్వైన్ చిరోన్, అమెరికా టెక్‌ వ్యాపారి కెన్నెత్ ఎల్ హెస్, సాహసయాత్రికుడు కరోల్‌ షాలర్‌, అమెరికా వైమానికదళ మాజీ కెప్టెన్‌ ఎడ్‌ డ్వైట్‌ ఎన్‌ఎస్‌-25లో ప్రయాణించనున్నారు. అయితే ఇదివరకు భారతీయ మూలాలు ఉన్న వ్యక్తులు అంతరిక్షయానం చేసినప్పటికీ వారంతా అమెరికా పౌరులు. గోపీచంద్‌ తోటకూర మాత్రం ఇప్పటికీ భారతీయ పౌరుడే. ఆయన వద్ద భారత పాస్‌పోర్టే ఉంది.

విజయవాడలో జన్మించిన గోపీచంద్‌ తోటకూర అమెరికాలో ఆరోనాటికల్‌ సైన్స్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ పూర్తి చేశారు. తర్వాత ఆయన కమర్షియల్‌ జెట్‌ పైలట్‌గా పని చేశారు. బుష్‌ ప్లేన్లు, ఏరోబాటిక్‌ ప్లేన్లు, సీప్లేన్లు, హాట్‌ ఎయిర్‌ బెలూన్లకు కూడా పైలట్‌గా వ్యవహరించారు. అట్లాంటాలో ప్రిజెర్వ్‌ లైఫ్‌ కార్ప్‌ అనే ఒక వెల్‌నెస్‌ సెంటర్‌కు గోపీచంద్‌ సహ వ్యవస్థాపకుడిగా ఉన్నారు.

1984 లో తొలిసారి రాకేశ్‌ శర్మ అంతరిక్షంలోకి వెళ్లి వచ్చిన విషయం తెలిసిందే. కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్‌, రాజా చారి, శిరీష బండ్ల లాంటి వారు అమెరికాలో ఉన్నా వారి మూలాలు మాత్రం భారత్‌లోనే ఉన్నాయి. అయితే గోపీచంద్‌ మాత్రం భారత తొలి స్పేస్‌ టూరిస్ట్‌గా చరిత్ర సృష్టించనున్నారు. ఇక బ్లూ ఆరిజిన్‌ సంస్థ ఇప్పటి వరకు 6 మిషన్లలో 31 మందిని స్పేస్‌లోకి తీసుకెళ్లింది. వీరంతా సముద్రమట్టానికి 80-100 కిలోమీటర్ల ఎగువన ఉండే కర్మన్‌ లైన్‌ వరకు వెళ్లి తిరిగివచ్చారు. మొత్తం 11 నిమిషాల పాటు సాగనున్న ఈ యాత్ర.. ధ్వని కంటే 3 రెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణించనున్నారు. కర్మన్‌ లైన్‌ను దాటి కొన్ని నిమిషాల పాటు భారరహిత స్థితిని అనుభవించనున్నారు. అక్కడి నుంచి భూమిని చూస్తూ మెల్లగా పారాచూట్ల సాయంతో క్యాప్స్యూల్‌లో కిందికి దిగనున్నారు.

ఈ ఎన్‌ఎస్‌-25 మిషన్‌కు సంబంధించిన ఖర్చును బ్లూ ఆరిజిన్ సంస్థ కాకుండా ఇతరులు భరిస్తున్నారు. అయితే అది ఎవరు అనేది మాత్రం ఆ సంస్థ వెల్లడించలేదు. ఇక భారత అంతరిక్ష పరిశోధన సంస్థ-ఇస్రో కూడా అంతరిక్ష యాత్రకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఇస్రో స్పేస్‌యాత్రకు ఎంపికైన నలుగురు వ్యోమగాముల పేర్లను ఇటీవలె ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెల్లడించారు. భారత వాయుసేనకు చెందిన గ్రూప్‌ కెప్టెన్లు ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్‌, అంగద్‌ ప్రతాప్‌, అజిత్ కృష్ణన్‌, వింగ్‌ కమాండర్‌ శుభాన్షు శుక్లాలు అంతరిక్షంలస్‌ సెంటర్‌కు గోపీచంద్‌ సహ వ్యవస్థాపకుడిగా ఉన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu