యంగ్ హీరో అక్కినేని అఖిల్ ప్రస్తుతం ‘మిస్టర్ మజ్ను’ పనుల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. చివరి దశలో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది ఆరంభంలో రిలీజ్ కానుంది. టీజర్ బాగుండటంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. అలాగే శాటిలైట్ హక్కులకు కూడ మంచి డిమాండ్ ఏర్పడింది. ప్రముఖ ఛానెల్ జీ తెలుగు ఈ హక్కులను సుమారు 5 కోట్ల భారీ మొత్తానికి కొనుగోలుచేసినట్టు తెలుస్తోంది. వెంకీ అట్లూరి డైరెక్షన్లో రూపొందుతున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయకిగా నటిస్తోంది. ఈ సినిమాలో సినియర్ నటి కాజల్ అగర్వాల్ కీలక పాత్రలో కనిపించనున్నారు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్ కావటంతో లవర్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న రిలీజ్ చేస్తే బెటర్ అని భావిస్తున్నారట.