పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తాజా చిత్రం ‘వకీల్ సాబ్’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. లాక్డౌన్ అడ్డుపడక పోతే ఇప్పటికే సినిమా విడుదల అయి ఉండేది. కరోనా కారణంగా అన్ని సినిమాలకు బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. పింక్ రీమేక్‌గా వస్తున్న వకీల్‌సాబ్ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. నివేదా థామస్, అంజలి, శృతి హాసన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన లిరికల్ సాంగ్ ‘మగువ మగువా’ మంచి ఆదరణ పొందింది. పవన్ కల్యాణ్ పుట్టిన రోజు నాటికి సినిమా విడుదలవుతుందని అభిమానులు ఆశగా ఎదురు చూశారు. సినిమా షూటింగ్ పూర్తికాకపోవడంతో అది సాధ్యం కావటం లేదు. అందుకే పవర్ స్టార్ పుట్టిన రోజు(సెప్టెంబర్ 2)సందర్భంగా అభిమానులకు దర్శక, నిర్మాతలు ఓ సర్ఫ్రైజ్ ఇవ్వబోతున్నారు. ఇదే విషయాన్ని దర్శకుడు వేణు శ్రీరామ్ కూడా ట్వీట్ చేశాడు. ఇది పవన్ అభిమానులకు పండగే. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తుంటే ఈ ఏడాది సినిమా విడుదల కష్టమే. ఎందుకంటే కరోనా పూర్తిగా అదుపులోకి రాకుండా షూటింగ్ వద్దంటున్నాడు పవర్ స్టార్. వచ్చే ఏడాది ఆరంభంలో బ్యాలెన్స్ షూటింగ్ పూర్తిచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.