HomeTelugu Trending2025 లో Gold rate 90000 అయ్యే అవకాశం ఉందా?

2025 లో Gold rate 90000 అయ్యే అవకాశం ఉందా?

Gold rate to hit 90000 mark in 2025?
Gold rate to hit 90000 mark in 2025?

Gold rate to take a surge:

బంగారం ధరలు 2024లో రికార్డ్ స్థాయిలో పెరిగి 10 గ్రాములకు రూ. 82,400 వద్ద నిలిచాయి. ప్రస్తుతం స్పాట్ మార్కెట్‌లో రూ. 79,350 వద్ద ఉండగా, మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX) వద్ద రూ. 76,600 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. 2025 నాటికి బంగారం ధర రూ. 85,000 – రూ. 90,000 మధ్యకు చేరుకునే అవకాశం ఉందని వ్యాపార విశ్లేషకులు అంటున్నారు.

ఇండియాలో బంగారం అంటే ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉంటుంది. వివాహాలు, కార్యక్రమాల్లో బంగారం కొనుగోలు అనేది అనివార్యం. కానీ ఆర్థిక అస్థిరతలు, భూ రాజకీయ ఉద్రిక్తతలు బంగారం ధరలను మరింత పెంచుతున్నాయి.

కేంద్ర బ్యాంకుల బంగారం కొనుగోళ్లు, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాలు కూడా ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయి. రష్యా-యుక్రెయిన్ యుద్ధం, మిడిల్ ఈస్ట్ సమస్యలు వంటి అంశాలు భవిష్యత్‌లో ధరలను ప్రభావితం చేయవచ్చు. అయినప్పటికీ, భూ రాజకీయ సమస్యలు తగ్గితే ధరలు తగ్గే అవకాశం ఉంది.

2025లో బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు:

1. భూ రాజకీయ ఉద్రిక్తతలు – ప్రపంచ స్థాయిలో అస్థిర పరిస్థితులు కొనసాగితే ధరలు మరింత పెరుగుతాయి.

2. ట్రంప్ ఎన్నికలు – ట్రంప్ మళ్లీ అధ్యక్షుడిగా ఎన్నికవ్వడంతో క్రిప్టోకరెన్సీపై దృష్టి పెట్టడం వల్ల బంగారం కొనుగోలు తగ్గవచ్చు.

3. తక్కువ వడ్డీ రేట్లు – ప్రపంచ ఆర్థిక వ్యవస్థ లిక్విడిటీని ప్రోత్సహించడం వల్ల బంగారం ధరలు పెరగవచ్చు.

4. భారత రత్నాభరణ పరిశ్రమ – 2025లో $100 బిలియన్ స్థాయికి పెరుగుతుందని అంచనా.

బంగారంతో పాటు వెండి కూడా 2024లో 30% పెరుగుదలను చూసింది. 2025 నాటికి వెండి ధర కిలోకు రూ. 1.25 లక్షల వరకు చేరుకోవచ్చు. భారత మార్కెట్లో పన్ను తగ్గింపుల కారణంగా జ్యువెలరీ, బార్స్, నాణేలు కొనుగోలు మరింత పెరిగాయి.

ALSO READ: పెద్ద హీరోల కారణంగా Kollywood కి ఎన్ని కోట్ల నష్టం వచ్చిందో తెలుసా?

Recent Articles English

Gallery

Recent Articles Telugu