నేడు లేడీ సూపర్ స్టార్ నయనతార పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో #HBDNayanatara అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు ఫ్యాన్స్. నయన్ నటిస్తున్న సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ కూడా విడుదల చేస్తున్నారు మేకర్స్. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి నెక్స్ట్ మూవీ “గాడ్ ఫాదర్” మేకర్స్ నయనతారకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టర్ ను రిలీజ్ చేశారు.
మలయాళ బ్లాక్ బస్టర్ డ్రామా ‘లూసిఫర్’కు రీమేక్ రూపొందుతున్న ‘గాడ్ ఫాదర్’ చిత్రం టైటిల్, ప్రీ, లుక్ ను ఇటీవల చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేశారు. మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న ‘గాడ్‌ఫాదర్’ను ఆర్‌బి చౌదరి, ఎన్‌వి ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తుండగా, కొణిదెల సురేఖ సమర్పకురాలుగా ఉన్నారు. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నాడు. అలాగే హాలీవుడ్ పాప్ సెన్సేషన్ బ్రిట్నీ స్పియర్స్ ఈ భారీ బడ్జెట్ యాక్షన్ డ్రామా ‘గాడ్ ఫాదర్’లో మెగాస్టార్ చిరంజీవి కోసం ఒక పాట పాడనున్నారు.