GOAT release date:
తమిళ స్టార్ విజయ్ సినిమాలలో ఈమధ్య ఏమాత్రం హైప్ లేని ఉన్న సినిమా GOAT. ఈ సినిమా ఈ నెల 5న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా మీద అంచనాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. చాలా మంది తెలుగు ప్రేక్షకులకు ఈ చిత్రం మూడు రోజుల్లో విడుదలవుతోందని కూడా తెలియదు.
అయితే, ఈ సినిమా తమిళనాడు, యూఎస్ బాక్సాఫీస్‌లో ప్రీ బుకింగ్స్‌లో మంచి జోరు కనబరుస్తోంది. యూఎస్ బాక్సాఫీస్‌లో GOAT ప్రీమియర్ షోలతోనే $470K పైగా వసూలు చేసింది. ఇది విజయ్ కెరీర్‌లో రెండో పెద్ద ఓపెనింగ్, లియో తర్వాతి స్థానం ఈ సినిమాదే.
తమిళనాడులో కూడా బుకింగ్స్ అద్భుత స్థాయిలో ఉన్నాయి. విజయ్ కి అక్కడ భారీ మార్కెట్ ఉంది.. పైగా పెద్ద ఫ్యాన్ బేస్ ఉన్న విజయ్ ఆఖరి సినిమా అది. కాబట్టి తమిళ్ మార్కెట్‌లో సినిమా మీద అంచనాలు ఉండడం సాధారణమే. అక్కడ ఈ సినిమా ఓపెనింగ్స్‌లో రికార్డులు బ్రేక్ చేస్తాయి అని అంచనాలు ఉన్నాయి.
తెలుగు మార్కెట్‌లో ఇప్పటివరకు ఈ సినిమాకి పెద్దగా స్పందన లేదు. కానీ అది రివ్యూల పైన ఆధారపడి మారే అవకాశం కూడా ఉంది. టీజర్లు, ట్రైలర్లు తెలుగు ప్రేక్షకులపై పెద్దగా ప్రభావం చూపించలేదు, అందుకే ఇంతవరకు పెద్దగా ఆదరణ రాలేదు. కానీ తమిళనాడు మరియు ఇతర విదేశీ మార్కెట్లలో విజయ్ మార్క్ బాక్సాఫీస్ జోరు మాత్రం అద్భుతంగానే ఉంది. సినిమా విడుదల అయ్యాక మంచి టాక్ వస్తే మాత్రం తెలుగు ప్రేక్షకుల నుండి కూడా మంచి ఆదరణ లభిస్తుంది అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.