HomeOTTGOAT OTT రిలీజ్ విషయంలో ట్విస్ట్ ఇచ్చిన డైరెక్టర్

GOAT OTT రిలీజ్ విషయంలో ట్విస్ట్ ఇచ్చిన డైరెక్టర్

GOAT OTT, GOAT OTT release date
Here’s the twist about GOAT OTT release

GOAT OTT release date:

తలపతి విజయ్ హీరోగా నటించిన ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ది GOAT సినిమా గత గురువారం థియేటర్లలో విడుదలై మంచి హైప్ సృష్టించింది కానీ తమిళనాడు కాకుండా మిగతా రాష్ట్రాల్లో ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ యాక్షన్ డ్రామా ప్రేక్షకులను థ్రిల్ చేయలేకపోయింది అని చెప్పాలి.

తాజాగా దర్శకుడు వెంకట్ ప్రభు, సినిమా గురించి ఒక ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, GOAT కు సంబంధించిన ఒరిజినల్ డైరెక్టర్స్ కట్ దాదాపు 3 గంటల 40 నిమిషాల నిడివి ఉందట. అయితే, థియేట్రికల్ కట్ కోసం ఈ సినిమాను ట్రిమ్ చేయాల్సి వచ్చింది అని అన్నారు.

Read More: GOAT సినిమాలో క్లైమాక్స్ కాపీ కొట్టారా?

ప్రొడ్యూసర్ అర్చన కలపతి కూడా ఈ డైరెక్టర్స్ కట్‌ని ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో రిలీజ్ చేయాలనే ఆలోచన చేస్తున్నారని, కానీ ఇది ఇంకా ఖరారు కాలేదని ఆయన పేర్కొన్నారు. ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.

AGS ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మించిన ఈ చిత్రంలో స్నేహ, మీనాక్షి చౌదరి, ప్రభుదేవా, జయరామ్, ప్రశాంత్, మోహన్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే అందించింది కూడా వెంకట్ ప్రభూనే. దర్శకుడి స్టైల్ యూనిక్ గా ఉండడంతో ప్రేక్షకులు ఈ డైరెక్టర్స్ కట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu