టాలీవుడ్ హీరో విష్ణు మంచు నటిస్తున్న తాజా చిత్రం ‘జిన్నా’. ఇషాన్ సూర్య డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవలే టైటిల్ ను ఆవిష్కరించిన మేకర్స్.. తాజాగా సినిమాలో విష్ణు పోషిస్తున్న గాలి నాగేశ్వరరావు పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. ‘జిన్నా’ షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచే హీరోయిన్లతో కలిసి సినిమాని వినూత్న రీతిలో ప్రమోట్ చేస్తూ వస్తున్నారు విష్ణు. ఇప్పుడు ఫస్ట్‌లుక్ ని కూడా అదే విధంగా ఒక మేకింగ్ వీడియో మాదిరిగా లాంచ్ చేశారు.
‘జిన్నా’ ఫస్ట్ లుక్ లో విష్ణు వైట్ అండ్ వైట్ డ్రస్ లో మెడలో స్కార్ఫ్ వేసుకొని.. రఫ్ గడ్డంతో కళ్ళజోడు పెట్టుకొని మాసీగా ఉన్నాడు. మంచు అవ్రమ్ భక్త సమర్పణలో ఏవీఏ ఎంటర్టైన్మెంట్స్ మరియు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్ పై కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కోన వెంకట్ కథ – స్క్రీన్ ప్లే అందించడమే కాకుండా క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకు సంగీతం సమకూరుస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.