‘గౌతమిపుత్ర శాతకర్ణి’ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాలు పన్ను మినహాయింపు ప్రకటించిన సంగతి తెలిసిందే.. అయితే చరిత్రను వక్రీకరించిన తీసిన ఈ సినిమాకు పన్ను మినహాయింపు ఎలా ఇస్తారని కొందరు చరిత్రకారులు వాధించారు. అంతేకాదు.. దర్శకుడు గుణశేఖర్ కూడా
శాతకర్ణికి పన్ను మినహాయింపు ఇచ్చినప్పుడు ‘రుధ్రమదేవి’కి మాత్రం ఇవ్వడానికి ప్రభుత్వం ఎందుకు ముందుకు రాలేదని ఎదురు ప్రశ్నించారు. పన్ను మినహాయింపు ఇవ్వడానికి కావల్సిన అన్ని అర్హతలు రుధ్రమదేవికి ఉన్నాయి.
కానీ మన ప్రభుత్వం మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే ఇప్పుడు తాజాగా వస్తోన్న ‘ఘాజి’ చిత్రానికైనా.. పన్ను మినహాయింపు ఇస్తారా..? అనే ప్రశ్న మొదలవుతుంది. ఇండో-పాక్ వార్ నేపధ్యంలో రూపొందించిన కథ ఇది. ఈ సినిమాకు కూడా పన్ను మినహాయింపుకి కావల్సిన అన్ని అర్హతలు ఉన్నాయి. ఫిబ్రవరి లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ చిత్రానికైనా.. పన్ను మినహాయింపు ఇస్తారో.. లేదో.. చూడాలి!