ఏపీలో టీడీపీకి మరో షాక్ తగలబోతోందా? మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు బీజేపీలో చేరుతున్నారా? మరో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు కూడా ఆయన బాటలోనే పయనించటానికి సిద్ధమయ్యారా? అనే చర్చ ఊపందుకుంది. మాజీ మంత్రి, టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు తెలుగుదేశం పార్టీని వీడే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. గంటా టీడీపీకి గుడ్ బై చెప్పేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లుగా వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. గత రెండు రోజులుగా ఢిల్లీలోనే ఆయన మకాం వేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. గంటా హస్తినలో బీజేపీ ముఖ్యనేత రాంమాధవ్‌తో సమావేశమైనట్లుగా తెలుస్తోంది.. రాంమాధవ్‌ను కలిసిన గంటా.. బీజేపీలో చేరేందుకు సంసిద్దత వ్యక్తం చేసినట్లు సమాచారం. రెండు రోజుల నుంచి రాజ్యసభ సభ్యులు… టీడీపీ నుంచి బీజేపీలో చేరిన సుజనా చౌదరి, సీఎం రమేష్‌తో గంటా చర్చలు జరిపారని సమాచారం.
మరోవైపు…గంటాతో పాటు బీజేపీలోకి వచ్చేందుకు మరో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. వారిద్దరితో ఇప్పటికే కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి మంతనాలు సాగించినట్లు సమాచారం. గంటా వైసీపీలోకి కాకుండా బీజేపీలోనే చేరటం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలే ఇందుకు సాక్ష్యంగా చెప్పుకోవచ్చు. మొత్తానికి…గంటా టీడీపీని వీడుతున్నట్లుగానే భావించాల్సి ఉంటుందని విశాఖకు చెందిన సొంత పార్టీ నేతలే చెబుతున్నారు.
ముస్లిం పక్షాలు కూడా బలమైన వాదనలు వినిపించాయి. వివాదాస్పద స్థలంలో ఏదైనా ఆలయాన్ని ధ్వంసం చేసి మసీదును నిర్మించారా అనే అంశంపై పురావస్తు శాఖ నివేదిక అసమగ్రంగా ఉందని తెలిపాయి. తుది విశ్లేషణ చేసిందెవరో? నివేదికను ఎవరు రూపొందించారో తెలియదు.. .దానిపై సంతకం కూడా లేదు… అయోధ్య రాముడి జన్మస్థానం కావొచ్చు… కాదనం… కానీ వివాదాస్పద స్థలంలోనే రాముడు పుట్టాడన్నదానికి ఆధారాల్లేవన్ని ముస్లిం లాయర్ల వాదన. అక్కడ ఉన్నది బాబర్ హయాంలో నిర్మించిన బాబ్రీ మసీదు మాత్రమేనని.. ప్రధాన గుమ్మటం కింద హిందువులు పూజలు చేసినట్లు ఆధారాల్లేవని.. బయట ఉన్న రామ్ చబుత్రాలోనే ఎప్పుడూ పూజలు జరిగాయి అని తెలిపారు. 1949 వరకూ ఆ స్థలం ముస్లింల ఆధీనంలోనే ఉందని.. అప్పటి వరకూ ప్రార్థనలు జరిగాయని వెల్లడించారు. 1949 డిసెంబరు 22-23న అర్ధరాత్రి సమయంలో ప్రధాన గుమ్మటం కింద విగ్రహాలు పెట్టారని, పురాణాలు, ఇతిహాసాలు, దేశాన్ని సందర్శించిన విదేశీ యాత్రికుల కథనాల ఆధారంగా నిర్ణయాలు తీసుకోరాదని.. వాస్తవంగా ఏం జరిగిందో చెప్పాలని కోరారు. మసీదును కూల్చేశారన్నది ఇటీవలి చరిత్రగా తేల్చారు.. దాన్నే ప్రామాణికంగా తీసుకోవాలన్నారు.