మెగా ప్రీన్స్ వరుణ్‌తేజ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘గని’. కిరణ్ కొర్రపాటి డైరెక్షన్‌లో బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కింది. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో సిద్దు , అల్లు బాబీలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్లు, పాటలకు అభిమానులు, సినీ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డ ఈ చిత్రం ఏప్రిల్ 8న విడుదల కానుంది. ఈ క్రమంలో మూవీ ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసిన చిత్ర బృందం తాజాగా ట్రైలర్ విడుదల చేసింది.
ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. ట్రైలర్ మొత్తం యాక్షన్ సీన్స్‌తో హైలెట్ అయ్యింది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా సందడి చేయనుంది. నటి నదియా, జగపతిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర కీలకపాత్రలో నటిస్తున్నారు.