HomeTelugu Trending'గని' రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది

‘గని’ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది

ghani movie new release dat
మెగా ప్రీన్స్‌ వరుణ్‌తేజ్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘గని’. ఫిబ్రవరి 25న ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా భీమ్లా నాయక్‌ రిలీజ్‌ నేపథ్యంలో గని చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని పేర్కొంది. ఈ క్రమంలో తాజాగా గని కొత్త రిలీజ్‌ డేట్‌ను ప్రకటించారు మేకర్స్‌. ఏప్రిల్‌ 8న మూవీని విడుదల చేస్తున్నట్లు గీతా ఆర్ట్స్‌ తమ అధికారికరంగా వెల్లడించింది.

వరుణ్‌ తేజ్‌ బాక్సార్‌గా కనిపించనున్న ఈ సినిమాకి కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వం వహించాడు. ఇందులో బాలీవుడ్‌ బ్యూటీ సయూ మంజ్రేకర్‌ హీరోయిన్‌గా నటించింది. అల్లు అరవింద్‌ సమర్పణలో సిద్దు ముద్ద, అల్లు బాబీలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్‌ అయిన ఈ చిత్రం టీజర్‌, పాటలకు మంచి స్పందన వచ్చింది. సునీల్‌ శెట్టి, ఉపేంద్ర, జగపతి బాబు కీలక పాత్రలు పోషించారు.

‘రాధేశ్యామ్‌’ కొత్త ట్రైలర్‌

Recent Articles English

Gallery

Recent Articles Telugu