దేశంలో సార్వత్రిక ఎన్నికల సమరం ముగిసింది. మొత్తం 7 దశల్లో జరిగిన పోలింగ్‌లో ప్రజా తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. ఇక ఫలితాలే తరువాయి. ఈ ఎన్నికలపై ప్రజల్లో ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో దేశంలోని ప్రసిద్ధ సర్వే సంస్థలు ప్రజా నాడిపై తమతమ అంచనాలతో కూడిన సర్వేలను బయటపెట్టాయి. తమిళనాడులోని వేలూరు లోక్‌సభ స్థానం మినహా 542 లోక్‌సభ స్థానాలు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీలకు ఏడు దశల్లో జరిగిన ఎన్నికల్లో ప్రజల నాడి ఎటువైపు ఉందో తెలుసుకోవడానికి ప్రజలు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయో ఆయా సర్వే సంస్థలు వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్.
సర్వే సంస్థ భాజపా కాంగ్రెస్ ఇతరులు
టైమ్స్ నౌ-వీఎంఆర్ 306 132 104
ఎబీపీ న్యూస్ 267 127 148
న్యూస్ నేషన్ 282-290 118-126 130-138
వీడీపీఏ 333 115 94
రిపబ్లిక్ టీవీ 287 128 127
రిపబ్లిక్ టీవీ-జన్ కీ బాత్ 295-315 122-125 102-125
రిపబ్లిక్ టీవీ-సీ-ఓటర్ 287 128 127
ఎన్డీటీవీ 302 127 133
టైమ్స్ ఆఫ్ ఇండియా 306 152 84
ఇండియా టీవీ 300 148 94
న్యూస్ 18 నెట్‌వర్క్ 336 82 124
న్యూస్ ఎక్స్-నేత 242 165 136
ఇండియా టుడే 232-251 73-99 56-74
సీఎన్ఎన్-ఐబీఎన్ 336 82 124
టుడేస్ చాణక్య 340 70 132
ఏపీలో వైసీపీ 18, టీడీపీ 7 స్థానాల్లో విజయం సాధిస్తుందని టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్ సర్వే తెలిపింది. తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్ పార్టీ 13 స్థానాల్లో విజయం సాధిస్తుందని తెలిపింది. కాంగ్రెస్ 2, బీజేపీ 1, ఎంఐఎం 1 స్థానాలను దక్కించుకుంటాయని చెప్పింది.