HomeTelugu Trendingభర్త కామెంట్స్‌పై జెనీలియా స్పందన

భర్త కామెంట్స్‌పై జెనీలియా స్పందన

Genelia reaction on her hus
బాలీవుడ్‌, టాలీవుడ్‌లో తనదైన రీతిలో నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్‌ జెనీలియా. అయితే ఈమె పెళ్లి తర్వాత నటనకు దూరంగా ఉంది. జెనీలియా తాజాగా తన భర్త రితేష్‌ దేశ్‌ముఖ్‌ ఓ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రితేష్‌ మాట్లాడిన తీరు అందర్నీ కట్టిపడేసింది. ‘జెనీలియా భర్తగా నాకు గుర్తింపు రావడం పట్ల గర్వపడుతున్నా’ అని ఆయన అనడంతో స్టూడియోలోని న్యాయ నిర్ణేతతోపాటు ఆడియన్స్‌ కూడా చప్పట్లు కొట్టారు. దీనికి సంబంధించిన వీడియోను జెనీలియా సోమవారం ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటూ.. ‘పురుషుడితో సమానంగా చూడాలని మహిళ పోరాడుతున్న ఈ ప్రపంచంలో నువ్వు నేను గర్వించేలా చేశావు రితేష్‌. ఇదే సందర్భంగా నేను నీకొకటి చెప్పాలి అనుకుంటున్నా.. ‘రితేష్‌ భాగస్వామి’గా ఉన్నందుకు నేను ఎంతో గర్విస్తున్నా’ అని పేర్కొన్నారు. వీరిద్దరికి మధ్య ఉన్న అనుబంధాన్ని చూసిన నెటిజన్లు అభినందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. 2003లో ‘తుజే మేరీ కసమ్‌’ సినిమా సమయంలో రితేష్‌, జెనీలియా మధ్య ప్రేమ ఏర్పడింది. 2012లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరికి ఇద్దరు కుమారులు.

క్లాప్ బోర్డ్‌తో గుత్తాజ్వాల స్పెషల్ ఇంటర్వ్యూ

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!