HomeTelugu Trendingజెనీలియా రీఎంట్రీ

జెనీలియా రీఎంట్రీ

Genelia reentry in marathi

‘బొమ్మరిల్లు’ సినిమాతో టాలీవుడ్‌లో హాసినిగా నిలిచిపోయిన బ్యూటీ జెనీలియా. ఆ తరువాత పలు సినిమాల్లో నటించిన అమ్మడు బాలీవుడ్ స్టార్ హీరో రితేశ్ దేశముఖ్ ను వివాహం చేసుకొని నటనకి దూరమైంది. పిలల్లు పుట్టిన తరువాత ఈ బ్యూటీ ఇంటిపట్టునే ఉంటూ వారి ఆలనా పాలన చూసుకుంటుంది. ఇక దీంతో పాటు భర్త బిజినెస్ లను చూసుకుంటూ బిజీగా ఉన్న జెనీలియా మరోసారి సినిమాలపై దృష్టి పెట్టనుంది.

ఈ నేపథ్యంలోనే అమ్మడు రీ ఎంట్రీకి రంగం సిద్ధం చేసింది. ఈ విషయాన్నీ ఆమె స్వయంగా తెలిపింది. ‘మీ అందరి ప్రేమాభిమానాలతో అన్ని భాషల్లోనూ చేశాను.. కానీ, నేను ఇంతవరకు పుట్టిపెరిగిన మహారాష్ట్ర చిత్ర పరిశ్రమ మరాఠీ లో మాత్రం పూర్తి స్థాయి పాత్రను చేయలేక పోయాను. ఇప్పుడు ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొంటున్నాను. ఇప్పుడు నా కల నెరవేరబోతోంది. ‘వేద్’సినిమాలో నేను ఒక కీలకమైన పాత్రను పోషిస్తున్నాను.’ అని చెప్పుకొచ్చింది. జియో శంకర్ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రితేష్ దర్శకత్వం వహించడం గమనార్హం. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu