కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి తనయుడు గాలి కిరీటి హీరోగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. యంగ్ డైరెక్టర్ రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తుండగా.. ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి నిర్మిస్తున్న ఈ సినిమాకు ‘వారాహి’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. దీనికి సంబంధించిన స్క్రీప్ట్ వర్క్, నటీనటుల ఎంపికను పూర్తి చేసుకున్న ఈ మూవీ నిన్న(మార్చి 4) హైదరాబాద్ ఘనంగా ప్రారంభమైంది.
ప్రముఖ దర్శకుడు రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరై ముహుర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టారు. అనంతరం హీరో గాలి కిరీటి లుక్‌ను సంబంధించిన వీడియోను చిత్రం బృందం విడుదల చేసింది. తెలుగు, కన్నడ భాషల్లో తెరకెక్కిస్తున్న ఈ మూవీలో ‘పెళ్లి సందD’ ఫేం శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా ఒకప్పటి స్టార్ హీరోయిన్ జెనిలియా కీలక పాత్ర పోషిస్తోంది. తెలుగులో చివరిగా జెనిలియా నా ఇష్టం సినిమాలో కనిపించింది. దాదాపు ఆమె సినిమాలకు దూరమై పదేళ్లు పూర్తయింది. ఈనేపథ్యంలో ఆమె తిరిగి రీఎంట్రీ ఇస్తుండటంతో ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.