Geethanjali Malli Vachindi review: అంజలి హీరోయిన్‌గా నటించిన తాజా చిత్రం ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’. పదేళ్ల క్రితం కోన వెంకట్ నిర్మించిన ‘గీతాంజలి’ అనే కామెడీ హారర్ సీక్వెల్‌గా ఈ మూవీ తెరకెక్కుతుంది. హారర్ కామెడీగా వచ్చిన గీతాంజలి సినిమా మంచి విజయం సాధించడంతో.. ఈ సినిమాపై బాగానే అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ఏప్రిల్ 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంజలి 50వ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాకి ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందిచారు.
డైరక్టర్ శ్రీను (శ్రీనివాస్ రెడ్డి), రైటర్స్ ఆరుద్ర (షకలక శంకర్), ఆత్రేయ (సత్యం రాజేష్)లు కృష్ణానగర్ బ్యాచ్ . సినిమా ఛాన్స్ లు కోసం ఆఫీసుల చూట్టు తిరుగుఉంటాడు. కానీ అతనితో సినిమా చేయడానికి ఎవరూ ధైర్యం చేయరు. ఇక మరో ప్రక్క అయాన్ (సత్య) హీరో అవుతానని పగటి కలలు కంటూంటాడు. దాంతో అతన్ని తమ ఆదాయ వనరుగా పెట్టుకుని ఫ్రెండ్స్ అయిన శ్రీను, ఆరుద్ర, ఆత్రేయలు హరించేస్తుంటారు.
‘దిల్’ రాజు సినిమా చేయడానికి ఓకే చేసాడని, నువ్వే హీరో అని చెప్పి లక్షలకు లక్షలు దొచేస్తారు. అయితే ఓ రోజు మోసం బయిటపడిపోతుంది. ఇంక మన వల్ల కాదు.. ఇంటికి వెళ్లిపోదాం అనుకున్న టైమ్ లో ఊటీలోని విష్ణు రిసార్ట్స్ ఓనర్ విష్ణు (రాహుల్ మాధవ్) మేనేజర్ గోవిందా గోవిందా (శ్రీకాంత్ అయ్యంగార్) నుంచి ఫోన్ వస్తుంది. శ్రీనుకు డైరక్షన్ ఛాన్స్ ఇస్తాను అంటాడు.
తను సినిమా తీస్తానని అయితే అదే ఊర్లో ఉన్న సంగీత్ మహల్‌లో షూట్ చేయాలని చెప్తాడు. అంతేకాకుండా తనే ఓ కథను కూడా అందిస్తాడు. అలాగే ఈ ప్రాజెక్టు పట్టాలు ఎక్కాలంటే అక్కడే కాఫీ హోటల్‌ను నడుపుతున్న అంజలి (అంజలి)ని తన సినిమాలో హీరోయిన్‌గా ఒప్పిస్తేనే సినిమా తీస్తానని అంటాడు. అప్పుడు అసలే కరువు మీద ఉన్న శ్రీను రంగంలోకి దిగి ఆ మాట ఈ మాట చెప్పి అంజలిని ఒప్పిస్తాడు. అయితే ఇక్కడో ట్విస్ట్ ఉంటుంది.
అయితే ఆ మహాల్‌లో శాస్త్రి (రవిశంకర్), ఆయన భార్య (ప్రియా) ఆత్మలు ప్రతి ఆగస్టు 8కి ప్రేమికుల మీద పగ తీర్చుకుంటాయని ఆ ఊరి జనం నమ్మకం. ఈ క్రమంలో…శ్రీనుకు ఎటువంటి పరిస్థితుల ఎదురైయ్యాయి. గీతాంజలి ఆత్మ మళ్లీ తిరిగి ఎందుకు రావాల్సి వచ్చింది? అన్నదే కథ.
చిన్న సినిమాలకు, అ ది కూడా హీరోయిన్ ప్రధాన పాత్రలో వచ్చిన సినిమాలకు సీక్వెల్స్ రావటం చాలా అరుదు. అయితే.. మొదటి నుండి ఈ సినిమా నుండి విడుదలైన అప్డేట్స్ కూడా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. ఇక సినిమా విషయానికి వస్తే.. కథ, కథనాలతో జబర్దస్త్ కామెడీని దట్టంగా దట్టించారు. ఓ ఫీల్ గుడ్ ఎమోషన్స్‌తో ఇంటర్వెల్ సీన్ వేసి.. ఫస్టాఫ్ ముగించారు.
సెకండాఫ్‌లో పూర్తిగా కామెడీకి పెద్ద పీట వేశారనే చెప్పాలి. సెకండాఫ్‌లో పూర్తిగా కామెడీకి పెద్ద పీట వేశారనే చెప్పాలి. మెథడ్ యాక్టింగ్ కాన్సెప్ట్‌తో కథను నడిపించిన విధానం బాగుంది. సినిమా ద్వితీయార్తంలో కొన్ని చోట్ల కామెడీ సన్నివేశాలు చక్కగా వర్కవుట్ అయ్యాయి. అయితే ఈ సినిమాకి ఎమోషనల్ క్లైమాక్స్ లేకపోవడం మైనస్‌గా చెప్పుకోవచ్చు. అయితే ఈ సినిమా చూసిన సగటు ప్రేక్షకుడుకు పెద్ద కొత్తదనం ఏమీ కనిపించదు. పెద్దగా గురిండిపోయే సీన్‌లు కూడా ఏమీ ఉండవు.
ఇక ఈ చిత్రంలో సత్య మరోసారి తన ఫెర్ఫార్మెన్స్‌తో మ్యాజిక్ చేశారనే చెప్పాలి. ఈ సినిమా భారాన్ని, శ్రీనివాస్ రెడ్డి, షకలక శంకర్, సత్యం రాజేష్ సపోర్టుతో సత్య తన భుజాలపై మోశాడని చెప్పవచ్చు. అంజలి క్యారెక్టర్ బలంగా లేకపోవడం, ఆకట్టుకోనే విధంగా లేకపోవడంతో పెద్దగా తన ఫెర్ఫార్మెన్స్‌కు స్కోప్ లేకపోయిందనిపిస్తుంది. డైలాగ్ కింగ్ రవిశంకర్ లాంటి యాక్టర్‌కు డైలాగ్స్ లేకుండా ఎక్స్‌ప్రెషన్స్‌తో మెప్పించిన తీరు బాగుంది. సినిమాటోగ్రాఫర్ కిల్లర్ నానిగా సునీల్, అతిథి పాత్రలో ఆలీ తమ వంతు కామెడీని పండించారు.