తెలుగు బిగ్‌బాస్ షో పై నెటిజన్లే కాకుండా గతంలో పాల్గొన్న కంటెస్టెంట్స్ కూడా విమర్శలు చేస్తుండడం చర్చనీయాంశంగా మారింది. బిగ్‌బాస్ సీజన్-2లో సింగర్ గీతా మాధురి పాల్గొన్న విషయం తెలిసిందే. తాజాగా ఈమె బిగ్‌బాస్‌పై సెటైర్లు వేస్తూ వ్యాఖ్యానించింది. బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తీసుకున్న ఫొటోను పోస్ట్ చేస్తూ… రెండేళ్ల క్రితం దిగిన ఫొటో ఇది అని తెలిపింది. బరువు తగ్గించుకుని సన్నగా అవ్వాలనుకుంటే బిగ్‌బాస్‌కు వెళ్లమని మీకు సలహా ఇస్తానని ఆమె చెప్పడం గమనార్హం.
ఇక గత ఏడాది బిగ్‌బాస్ షోలో నటుడు వరుణ్ సందేశ్, ఆయన భార్య వితిక షేరు కూడా పాల్గొన్నారు. ఆ టైమ్‌లో సోషల్ మీడియాలో తన గురించి వచ్చిన విమర్శల పట్ల చాలా బాధపడ్డానని ఇటీవలే వితిక తెలిపింది. బిగ్ బాస్ మూడో సీజన్లో పాల్గొన్న ఆమె ఇటీవల తన అనుభవాలను చెబుతూ చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.