HomeTelugu Big Storiesగరికపాటి vs చిరంజీవి.. నాగబాబు ట్వీట్‌.. వైరల్‌

గరికపాటి vs చిరంజీవి.. నాగబాబు ట్వీట్‌.. వైరల్‌

Garikapati and Megastar Chi
మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించి ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న సంగతి తెలసిందే. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి ఆధ్వర్యంలో అలయ్ బలయ్ కార్యక్రమాన్ని నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో గరికపాటి ప్రసంగిస్తున్న టైమ్‌లో చిరంజీవి వచ్చారు. చిరుతో సెల్ఫీలు దిగేందుకు ఫ్యాన్స్‌ పోటీ పడ్డారు. దీంతో, గరికపాటి ప్రసంగానికి అంతరాయం కలిగింది. దీంతో వెంటనే చిరంజీవి ఫోటో సెషన్ ను ఆపకుంటే అక్కడి నుంచి వెళ్లిపోతానని గరికిపాటి మైక్ లో ప్రకటించారు.

వెంటనే చిరంజీవి సెల్ఫీలు దిగడం ఆపేసి వచ్చారు. కార్యక్రమంలో చిరంజీవి, గరికపాటి ఇద్దరూ బాగానే మాట్లాడుకున్నారు. కానీ మెగాస్టార్ పై గరికపాటి అసహనం వ్యక్తం చేయడం మెగా అభిమానులకు నచ్చలేదు. సోషల్ మీడియాలో ఆయన్ని ట్రోల్ చేస్తూ కించ పరిచే పోస్టులు పెడుతూ వచ్చారు. ఈ క్రమంలో చిరంజీవి సోదరుడు నాగబాబు చేసిన ట్వీట్లు వివాదాన్ని రాజేశాయి. ఏపాటి వాడైనా చిరంజీవి ఇమేజ్ ను చూస్తూ ఆ పాటి అసూయపడటం పరిపాటేనని నాగబాబు అన్నారు.

నాగబాబు ట్వీట్ పై బ్రాహ్మణ ఫెడరేషన్ ఉపాధ్యక్షుడు ద్రోణంరాజు రవికుమార్ మండిపడ్డారు. నిత్యం ప్రవచనాలతో సమాజాన్ని సంస్కారవంతం చేస్తున్న ఒక సనాతనవాది, ఆథ్యాత్మికవేత్తను పట్టుకుని… నటనావ్యాపారం తప్ప సమాజహితాన్ని మరిచిన ఒక చిత్ర వ్యాపారిని చూసి అసూయ చెందాడనడం ఆకాశం మీద ఉమ్మేయడం వంటిదేనని విమర్శించారు.

ఈ నేపథ్యంలో నాగబాబు మళ్లీ ట్వీట్ చేస్తూ స్పందిస్తూ.. ‘గరికపాటి వారు ఏదో మూడ్ లో అలా అని ఉంటారు. ఆయనలాంటి పండితుడు అలా అని ఉండికూడదని అన్నామే తప్ప.. ఆయనతో క్షమాపణ చెప్పించుకోవాలని మాకు కోరిక లేదు. మెగాభిమానులు ఆయనని అర్థం చేసుకోవాలే గానీ.. ఆయన గురించి ఎవరూ తప్పుగా మాట్లాడవద్దని రెక్వెస్ట్’ అని పేర్కొన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu