లక్ష్ చదలవాడ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘గ్యాంగ్‌స్టర్ గంగరాజు’ షూటింగ్ పార్ట్ పూర్తిచేసుకుంది. ప్రస్తుతం పోస్ట్
ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటోంది. ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ ఇషాన్ సూర్య తెరకెక్కిస్తున్నాడు. పద్మావతి
చదలవాడ ఈ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్,
పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. టైటిల్ సాంగ్ ఇప్పటికే యూట్యూబ్‌లో మంచి వ్యూస్ వస్తున్నాయి.
గ్యాంగ్‌స్టర్ గంగరాజు మూవీని డిసెంబర్‌లో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను
ఆకట్టుకునేలా డిఫరెంట్ కథాంశంతో తెరకెక్కిస్తున్నట్లు దర్శక, నిర్మాతలు తెలిపారు. ఈ సినిమాకు సాయి కార్తీక్ సంగీతం
అందిస్తున్నారు.