గణపథ్ సినిమా తెలుగు ట్రైలర్ విడుదలైంది. ధనవంతులకు, పేదలకు మధ్య గోడను బద్దలు కొట్టే యోధుడొకడు వస్తాడు. ఆ యోధుడు చచ్చేవాడు కాదు చంపేవాడంటూ టైగర్ ష్రాఫ్‌కు వీర లెవల్లో ఎలివేషన్ ఇచ్చారు. దీన్ని బట్టి చూస్తే ఒక ధనవంతుడి చేతిలో నలిగిపోతున్న జనాలను కాపాడేందుకు టైగర్ ష్రాఫ్ వస్తాడని తెలుస్తుంది.
అంతేకాకుండా విలన్‌పై దాడి చేయడానికి హీరో ఎంచుకున్న మార్గం బాక్సింగ్ అని.. ఆ రింగ్‌లో విలన్‌ను, వాళ్ల మనుషులను మట్టుకురిపిస్తే విలన్ సామ్రాజ్యం కుప్పకూలిపోతుందన్నట్లు ట్రైలర్‌లో చూపించారు. ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగియాయి.
అంతేకాకుండా మరో 50ఏళ్ల తర్వాత ఫ్యూచర్ ఎలా ఉండబోతుందొనని సినిమాలో చూపించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇదే సబ్జెక్ట్‌కు యాక్సన్‌ను పుష్కలంగా జోడించినట్లు ట్రైలర్‌తో క్లారిటీ వచ్చేసింది. అమితాబ్ ఈ సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తుంది.
నేషనల్ అవార్డు హీరోయిన్ కృతి సనన్ సైతం పోరాటలతో అదరగొడుతుంది. ట్రైలర్ చివర్లో గణపతి షాట్ మాత్రం వేరే లెవల్. మొత్తంగా ట్రైలర్ కాస్త ఆసక్తి రేకెత్తించేలానే కనిపిస్తుంది. వికాస్ బాల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అక్టోబర్ 20న హిందీతో పాటు, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది. అదే రోజున టైగర్ నాగేశ్వరరావు.. ముందు రోజున భగవంత్ కేసరి, లియో సినిమాలు రిలీజవుతున్నాయి.