‘ఆర్‌ఎక్స్ 100’ సినిమా దర్శకుడిగా అజయ్ భూపతికి, హీరోయిన్‌గా పాయల్ రాజ్‌పుత్ మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమాలో పాయల్ ఎంత బోల్డ్‌గా నటించిదో తెలిసిందే. ఆ టైమ్ ఈ అమ్మడికి మంచి యూత్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ తరువాత పలు సినిమాలు చేసినప్పటికి అవి పెద్దగా సక్సెస్ కాలేదు అని చెప్పాలి. ఈ నేపధ్యంలో మరో సారి అజయ్ భూపతి డైరెక్షన్‌లో పాయల్ నటిస్తున్న చిత్రం ‘మంగళవారం’. ఫీ మేల్ ఓరియెంటెడ్ సబ్జెక్ట్‌తో హార్రర్ కామెడీ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పాయల్ రాజ్‌పుత్ లీడ్ రోల్‌లో నటిస్తోంది.
ఇప్పటికే విడుదల చేసిన మంగళవారం టైటిల్, కాన్సెప్ట్ పోస్టర్లు నెట్టింట హల్ చల్ చేస్తూ.. సినిమాపై అంచనాలు అమాంతం పెంచేస్తున్నాయి. ఈ సినిమా నుంచి తాజాగా గణగణ మోగాలిరా ఫుల్ లిరికల్ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఏ క్రియేటివ్ వర్క్స్, ముద్ర మీడియా వర్క్స్ బ్యానర్లు సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి.
షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ మూవీలో నందితా శ్వేత, దివ్య పిళ్లై, అజ్మల్, రవీంద్ర విజయ్, కృష్ణ చైతన్య, అజయ్ ఘోష్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కాంతార ఫేం అజనీశ్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తుండటంతో అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. అజయ్ భూపతి రెండో సినిమా మహాసముద్రం భారీ అంచనాల మధ్య విడుదలై.. ఫ్లాప్ గా మిగిలిపోయింది.