Game Changer vs Daaku Maharaj vs Sankranthiki Vastunnam:
2025 సంక్రాంతి పండుగకు మూడు పెద్ద తెలుగు సినిమాలు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడానికి సిద్ధమయ్యాయి. రామ్ చరణ్-శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన ‘Game Changer’, బాలకృష్ణ-బాబీ డైరెక్షన్‌లో ‘Daaku Maharaaj’, వెంకటేష్-అనిల్ రవిపూడి కాంబినేషన్‌లో ‘Sankranthiki Vasthunnam’ సంక్రాంతి థియేటర్లలో సందడి చేయబోతున్నాయి.
Game Changer సంక్రాంతి బరిలో మొదటగా జనవరి 12న విడుదలవుతోంది. ఈ సినిమా రెండు రోజులు సోలో రన్ పొందుతుంది. శంకర్ గ్రాండ్ విజన్, రామ్ చరణ్ ఎనర్జీ, భారీ బడ్జెట్‌తో సినిమా భారీ అంచనాలను పెంచింది. ట్రైలర్ మంచి స్పందన తెచ్చుకోగా, యూట్యూబ్‌లో భారీ వ్యూస్ సాధించింది. డిస్ట్రిబ్యూటర్స్‌లో కూడా ఈ సినిమా మీద విశ్వాసం పెరిగింది.
View this post on Instagram
Daaku Maharaaj జనవరి 14న థియేటర్లలోకి రానుంది. బాలకృష్ణ కొత్త గెటప్‌లో కనిపిస్తుండటంతో ఈ సినిమా మీద భారీ హైప్ ఉంది. అయితే ట్రైలర్‌లో కంటెంట్ ఎక్కువగా రివీల్ చేయకపోవడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి పక్కదారి పట్టింది. కానీ థియేటర్లలో సినిమా కంటెంట్ బాగుంటే ఈ సినిమా భారీ విజయం సాధించవచ్చు.
#DaakuMaharaaj Srikalahasti #RR picture Palace Main Theater confirmed 👍 pic.twitter.com/SnwHTCPbKR
— CHENDU C balayya fans (@CHENDUC4) January 8, 2025
Sankranthiki Vasthunnam జనవరి 16న విడుదల కానుంది. ఇది పూర్తిగా ఫ్యామిలీ ఆడియెన్స్‌ను టార్గెట్ చేసిన సినిమా. వెంకటేష్ ఫ్యామిలీ ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నారు. అనిల్ రవిపూడి కామెడీ టచ్‌తో ఈ సినిమా పండుగ వాతావరణంలో బాగా కలుస్తుంది. ట్రైలర్ మ్యూజిక్, ఫన్ ఎలిమెంట్స్ ఆకట్టుకుంటున్నాయి.
View this post on Instagram
ఈ మూడు సినిమాలు పండుగ సీజన్‌లో బాక్సాఫీస్‌ని షేక్ చేసే అవకాశముంది. అయితే వీటి విజయం పూర్తిగా ప్రేక్షకుల స్పందన మీద ఆధారపడి ఉంటుంది. Game Changer ముందుగా విడుదల అవుతూ మొదటి రెండు రోజులు పెద్ద ఓపెనింగ్ కలెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. Daaku Maharaaj సీరియస్ కంటెంట్‌తో ఆదరణ పొందవచ్చు. Sankranthiki Vasthunnam ఫ్యామిలీ ఆడియెన్స్‌ని బాగా ఆకట్టుకునే అవకాశం ఉంది.
ALSO READ: నైజాం లో Daaku Maharaaj బ్రేక్ ఈవెన్ కి టార్గెట్ ఎంతంటే!