Game Changer ticket rates hike:
రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్‌లో రూపొందిన Game Changer సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రీలీజ్‌కి సిద్ధమవుతోంది. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఈ హై బడ్జెట్ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోబోతోంది.
ఇప్పుడు ఏపీ ఫ్యాన్స్‌కి ఓ ఆసక్తికర అప్‌డేట్ వచ్చింది. గేమ్ చేంజర్ సినిమా కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ రేట్లు పెంచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సింగిల్ స్క్రీన్లలో టికెట్ రేట్లు రూ.135 (జీఎస్టీ సహా) వరకు, మల్టీప్లెక్స్‌లలో రూ.175 (జీఎస్టీ సహా) వరకు పెంచేలా ప్రభుత్వ ఉత్తర్వు (జి.ఓ) జారీ అయ్యింది. అలాగే, జనవరి 10న ప్రత్యేకంగా బెనిఫిట్ షోలు రాత్రి 1 గంట నుంచి ప్రారంభం అవుతాయి. బెనిఫిట్ షో టికెట్ ధర రూ.600 వరకు నిర్ణయించారు.
BREAKING#GameChanger AP Ticket Prices
1Am show ₹600
Day 1-14!! Plexes ₹352 and Singles ₹282.50
Day15- Full Run ₹177 & ₹147.5! pic.twitter.com/p9lGJrekqx
— Avinash chowdary 🦁 (@ysj439551) January 5, 2025
జనవరి 11 నుంచి సినిమా థియేటర్లలో రోజుకు 5 షోలు జరుగుతాయి. ఈ టికెట్ రేట్ల పెంపు, అదనపు షోలు జనవరి 23 వరకు అమల్లో ఉంటాయి. అంటే గేమ్ చేంజర్కు బాక్సాఫీస్ వద్ద రెండు వారాల పాటు బూస్ట్ లభించనుంది.
ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తుండగా, ఎస్.జె. సూర్య, అంజలి, శ్రీకాంత్, నవీన్ చంద్ర, సునీల్ వంటి ప్రముఖులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ సినిమాకు సంగీతం అందించారు. స్క్రిప్ట్‌ను తమిళ దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్ అందించారు.
ప్రేక్షకులు సినిమా టికెట్ రేట్లపై కొన్ని అసంతృప్తులు వ్యక్తం చేస్తున్నా, గేమ్ చేంజర్ సినిమా రికార్డులు సృష్టించేలా కనపడుతోంది. మరి ఈ సినిమా పెద్ద విజయాన్ని సాధించి సంక్రాంతి విజేతగా నిలుస్తుందో లేదో చూడాలి.
ALSO READ: క్రిస్టియన్ పద్ధతిలో పెళ్లి అనగానే తన తండ్రి రియాక్షన్ చూసి Keerthy Suresh షాక్ అయ్యిందట!