Game Changer breakeven:
2025 సంక్రాంతి పండుగకు రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. శంకర్ దర్శకత్వంలో, దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా జనవరి 10న థియేటర్లలో విడుదల అవుతోంది. ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ప్రోమోషన్ ఈవెంట్స్‌ను అమెరికా, ముంబై, ఆంధ్రప్రదేశ్‌లో ఘనంగా నిర్వహించారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ హాజరైన ప్రీ-రిజీజ్ ఈవెంట్ పెద్ద హైలైట్‌గా మారింది.
సినిమా థియేట్రికల్ రైట్స్ భారీ మొత్తానికి అమ్ముడయ్యాయి.
నిజాం: రూ.36 కోట్లు
ఆంధ్రప్రదేశ్: రూ.72 కోట్లు
సీడెడ్: రూ.22 కోట్లు
మొత్తం కలిపి తెలుగు రాష్ట్రాల్లో రూ.130 కోట్లు ప్రీ-రిలీజ్ బిజినెస్ జరిగింది. సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే రూ.260 కోట్ల గ్రాస్ రావాలి. హిట్ కావాలంటే రూ.300 కోట్లు అవసరం.
తమిళనాడులో కూడా మంచి క్రేజ్ ఉంది. అక్కడ థియేట్రికల్ రైట్స్ రూ.32 కోట్లకి అమ్ముడయ్యాయి. ఇక ఉత్తరాదిలో, కర్ణాటక, కేరళ, ఓవర్సీస్ మార్కెట్‌లోనూ బిజినెస్ బాగానే జరిగింది. అయితే, పూర్తి వివరాలు ఇంకా బయటకి రాలేదు.
సంక్రాంతి సెలవులు, ఏపీ టికెట్ రేట్ల పెంపు, తమిళనాడులో పెద్ద సినిమాలు లేకపోవడం వంటి అంశాలు ‘గేమ్ చేంజర్’కి బాగా కలిసి రానున్నాయి. కియారా అద్వానీ, అంజలి, శ్రీకాంత్, ఎస్.జే. సూర్యా, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ముఖ్యంగా ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ సినిమాకి హైలైట్ అని చెప్పుకుంటున్నారు.
ఇప్పటికే వచ్చిన పాటలు, ట్రైలర్ పట్ల మంచి స్పందన వచ్చింది. అభిమానులు ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నారు. ‘గేమ్ చేంజర్’ సంక్రాంతి సీజన్‌లో పెద్ద హిట్ అవుతుందా లేదా చూడాలి.
ALSO READ: Game Changer vs Daaku Maharaj vs Sankranthiki Vastunnam: ఈ ఏడాది సంక్రాంతి విజేత ఎవరు అవ్వచ్చు?