కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి తనయుడు గాలి కిరిటి త్వరలోనే గాలి కిరిటి కన్నడ, తెలుగు ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. దీనికి సంబంధించిన స్క్రీప్ట్ వర్క్, నటీనటుల ఎంపిక కూడా పూర్తయినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో త్వరలోనే మూవీ సెట్స్‌పైకి రానుందంటూ తాజాగా చిత్ర బృందం అప్డేట్ ఇచ్చింది. యంగ్ డైరెక్టర్ రాధాకృష్ణ ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి నిర్మిస్తున్న ఈ సినిమాకు ‘వారాహి’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు.
తెలుగు కన్నడ ద్విభాషా చిత్రంగా ప్రేమ, కుటుంబ కథా అంశాలను కలిపి రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ప్రారంభానికి సన్నాహాలు చేసుకుంటున్నది. దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తుండగా..కె సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు తీసుకుంటున్నారు. పీటర్ హెయిన్ స్టంట్స్ సమకూర్చుతున్నారు. ఈ మూవీలో మిగతా నటీనటులను కూడా త్వరలోనే ప్రకటించనున్నారు. సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలన్న ఆలోచన రాగానే దానిపైనే దృష్టి సారించిన కిరీటి స్వదేశంతో పాటు విదేశాల్లోనూ ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నాడట. మొత్తంగా ఓ రేంజిలో సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న గాలి కిరీటి ఏ మేర జనాలను మెప్పిస్తారో చూడాలి.