బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం మార్టిన్ లూథర్ కింగ్. తమిళ నటుడు యోగిబాబు నటించిన బ్లాక్ బస్టర్ మూవీ మండేలా సినిమాకి రీమేక్‌గా ఈ సినిమా వస్తుంది. ఈ సినిమాను తమిళంలో మహావీరుడు ఫేమ్ మడోన్నా అశ్విన్ దర్శకత్వం వహించగా.. తెలుగులో ఈ సినిమాకు పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వం వహిస్తుంది.
ఇక దర్శకురాలిగా ఆమెకు తొలి సినిమా ఇది. ఇప్పటికే ఈ సినిమా నుంచి మేకర్స్ ఫస్ట్ లుక్‌తో పాటు టీజర్ విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి మేకర్స్ మ్యూజికల్ అప్‌డేట్ ఇచ్చారు.
ఈ సినిమా నుంచి ‘గబ గబా గబా’ అనే పాటను మేకర్స్ విడుదల చేశారు. స్మరన్ సాయి, ఐశ్వర్య దరూరి ఈ పాటను అలపించగా.. రెహమాన్ లిరిక్స్ రాశాడు. స్మరణ్ సాయిసాంగ్ సంగీతం అందించాడు. ఈసినిమాలో నరేష్, వెంకటేష్ మహా, శరణ్య ప్రదీప్, గోపరాజు రమణ తదితరులు ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
వైనాట్ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో మహాయాన మోషన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్.శశికాంత్, చక్రవర్తి రామచంద్ర నిర్మిస్తుండగా.. కేరాఫ్ కంచరపాలెం ఫేమ్ వెంకటేష్ మహా క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.