HomeTelugu TrendingGaami: విశ్వక్ సేన్ కెరీర్‌లో ఇదే హయ్యెస్ట్‌‌!

Gaami: విశ్వక్ సేన్ కెరీర్‌లో ఇదే హయ్యెస్ట్‌‌!

Gaami first day collection

Gaami విశ్వ‌క్ సేన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘గామి’. డిఫరెంట్‌ జోనర్‌లో తెరకెక్కిన ఈ సినిమా నిన్న విడుదలై మంచి టాక్‌ తెచ్చుకుంది. ఈ సినిమా తొలిరోజు తొమ్మిది కోట్ల ఏడు లక్షల క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన‌ట్లు సినిమా యూనిట్ ప్రకటించింది. విశ్వక్ సేన్ కెరీర్ లో ఫస్ట్ డే హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన మూవీ ఇదే అని ప్రకటించింది. విద్యాధ‌ర్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా.. మూడు క‌థ‌ల‌ను క‌లుపుతూ డిఫ‌రెంట్ స్క్రీన్‌ప్లేతో తెర‌కెక్కించాడు.

ఈ సినిమాలోని హిమ‌లాయాల తాలూకు విజువ‌ల్స్‌, బీజీఎమ్‌, వీఎఫ్ఎక్స్ సీన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. నైజాం ఏరియాలోనే గామి మూవీ శుక్ర‌వారం మూడు కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ ద‌క్కించుకున్న‌ట్లు స‌మాచారం. ఓవ‌ర్‌సీస్‌లో కోటి వ‌ర‌కు వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన‌ట్లు చెబుతోన్నారు.

ఈ సినిమాలో అఘోరాగా విశ్వ‌క్‌సేన్ యాక్టింగ్ బాగుందంటూ ప్రేక్షకులు అంటున్నారు. ఈ సినిమాలో చాందిని చౌద‌రి, అభిన‌య, అబ్దుల్ స‌మ‌ద్ కీల‌క పాత్ర‌లు పోషించారు. పాజిటివ్ టాక్ కార‌ణంగా ఈ వీకెండ్‌లోనే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అయ్యే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. గామితో పాటు భీమా,మ‌ల‌యాళం డ‌బ్బింగ్ మూవీ ప్రేమ‌లు కూడా శుక్ర‌వారం తెలుగు ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది.

 

View this post on Instagram

 

A post shared by Vishwak Sen (@vishwaksens)

Recent Articles English

Gallery

Recent Articles Telugu