HomeTelugu Trendingనాబర్త్ డే జరపొద్దు.. ఫ్యాన్స్‌కు ఆకాష్‌ పూరీ రిక్వెస్ట్‌.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు

నాబర్త్ డే జరపొద్దు.. ఫ్యాన్స్‌కు ఆకాష్‌ పూరీ రిక్వెస్ట్‌.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు

Funny trolls on Akash puri

డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్ వారుసుడు ఆకాష్ పూరీ హీరోగా టాలీవుడ్‌లో రెండు సినిమాలు చేశాడు. కానీ సరైన హిట్ రాలేదు. ఇటీవలే ఆకాష్ పూరీ ట్విట్టర్‌లో పెట్టిన పోస్ట్‌పై అతన్ని ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు నెటిజన్లు. ‘ప్రియమైన అభిమానులకు నా విన్నపం. ప్రభుత్వ ఆదేశాలను అనుసరిస్తూ సామాజిక దూరం పాటిస్తూ ఈ మహమ్మారి కరోనా వైరస్‌ని అరికట్టడం మన బాధ్యత. జరుగుతున్న ఈ విపత్కర పరిస్థితుల్లో పెరుగుతున్న కరోనా కేసుల్ని దృష్టిలో పెట్టుకుని మీ/మన క్షేమం కొరకై ఈ సంవత్సరం నేను పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవడం లేదు. కావున మీరు కూడా ఎలాంటి సన్నాహాలు జరపకుండా.. మీరు మీ కుటుంబ సభ్యులతోనే క్షేమంగా ఉంటారని భావిస్తున్నాను. పరిస్థితులు అన్ని చక్కదిద్దుకున్నాక మరలా మనం ఎప్పటిలాగే కలుస్తాం అని బలంగా నమ్ముతున్నాను. అప్పటివరకూ అధికారుల సూచనలను పాటిస్తూ భౌతిక దూరానికి కట్టుబడి ఉండాలని కోరుకుంటున్నాను. నా విన్నపాన్ని మన్నిస్తారని ఆశిస్తూ.. మీ ఆకాష్ పూరి (సంతకంతో సహా)’ అంటూ ట్విట్టర్‌లో చాలా పద్దతిగా ఫ్యాన్స్ కోసం ఓ రెంజ్‌లో ట్వీట్ చేశాడు ఈ కుర్ర హీరో.

దీనిపై స్పందించిన నెటిజన్లు.. అవునా భయ్యా.. సరే కాని నీ బర్త్ డే ఎప్పుడు భయ్యా అంటూ ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తున్నారు. ఇంతకీ మీరు అన్నది మీ బర్త్ డే గురించా.. లేక మీ నాన్న (పూరీ జగన్నాథ్) బర్త్ డే గురించా.. మీ బర్త్ ఎప్పుడో కూడా తెలియదు.. దయజేసి బర్త్ డే ఎప్పుడో చెప్తారా కొంచెం అంటూ మీమ్స్ క్రియేట్ చేసి మరీ ట్రోల్ చేస్తున్నారు. అన్నట్టు ఆకాష్ పూరీ బర్త్ డే గూగుల్‌లో వెతికినా దొరకడం లేదంట.. కావాలంటే మీరు ట్రై చేయండి అంటూ సవాల్ కూడా చేస్తున్నారు. అయితే ఏప్రిల్ 12 అని వికీపీడియాలో కనిపిస్తోంది. పాపం ఆకాష్ తన పోస్ట్‌లో బర్త్ డే డేట్ మెన్షన్ చేసినా ఇంత శ్రమ ఉండేది కాదు కదా అంటూ సెటైర్లు వేస్తున్నారు.

Image

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!