ఫన్ బకెట్ భార్గవ్ అప్పట్లో అవకాశం ఇప్పిస్తానని చెప్పి మాయమాటలతో బాలికను లోబరుచుకున్నాడు. ఈ క్రమంలోనే ఏప్రిల్ 18న అరెస్ట్ అయ్యాడు. పెందుర్తి పీఎస్ కేసులో భార్గవ్ పై కేసు కూడా నమోదైంది. జూన్ 15న షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది కోర్టు. బెయిల్ పై బయటకు వచ్చాక కూడా భార్గవ్ తీరు మారలేదని తాజాగా తెలిసింది.
మళ్లీ యథావిధిగా చిల్లర వ్యవహారాలకు భార్గవ్ పాల్పడడం మొదలుపెట్టాడు. బెయిల్ రూల్స్ ను ఉల్లంఘించాడు. ఈ నేపథ్యంలోనే భార్గవ్ పై మెమో ఫైల్ చేశాడు డీఎస్పీ ప్రేమ్ కాజల్. కేసు విచారణలో ఉండగా.. సాక్షులను బెదిరించడం.. ప్రభావితం చేసేలా ప్రకటనలు చేసినట్టు మెమోలో పోలీసులు పొందుపరిచారు. దీంతో బెయిల్ రద్దు చేసిన పోక్సో కోర్టు ఈనెల 11 వరకూ రిమాండ్ విధించింది. ఫన్ బకెట్ భార్గవ్ ను సెంట్రల్ జైలుకు తరలించారు.
ఇప్పటికే బాలికను మోసం చేసిన కేసు ఇప్పటికీ నడుస్తోంది. రెండు నెలలు ఊచలు లెక్కబెట్టాడు. బెయిల్ పై బయటకు వచ్చాడు. ఇకనైనా పద్ధతి మార్చుకోకుండా ప్రవర్తించడంతో మళ్లీ జైలుకు వెళ్లాడు. ఇక సోషల్ మీడియా ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొంచెం ఘాటు పదాలే ఉపయోగించాడు. తనపై ఉన్న కేసు గురించి పలు వ్యాఖ్యలు చేశాడు. ఈ వీడియోల ఆధారంగా బెయిల్ రద్దు చేయాలని కోర్టులో మెమోను పోలీసులు దాఖలు చేశారు. దీంతో మళ్లీ భార్గవ్ జైలు పాలయ్యాడు.