HomeTelugu Big StoriesAllu Arjun సంధ్య థియేటర్ కేస్ లో నిందితుల జాబితా ఇదే!

Allu Arjun సంధ్య థియేటర్ కేస్ లో నిందితుల జాబితా ఇదే!

Full Accused List of Allu Arjun's Sandhya Theatre Case
Full Accused List of Allu Arjun’s Sandhya Theatre Case

Accused list in Allu Arjun’s case:

హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటన కేసు పెద్ద కలకలం రేపుతోంది. ఈ ఘటనపై పోలీసుల దర్యాప్తులో కొత్త నిందితుల జాబితాను విడుదల చేశారు. ఈ జాబితాలో పుష్ప 2 నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్, అల్లు అర్జున్‌ సహా మరికొందరు కీలక వ్యక్తులు చేరారు.

తొలుత నిందితుల జాబితా A1 నుండి A8 వరకు సాంధ్య థియేటర్ యాజమాన్యానికి చెందినవారిగా ఉంది. ఇందులో ప్రధానంగా పెద్ద రామిరెడ్డి (A1), చిన్న రామిరెడ్డి (A2), ఇతర భాగస్వాములు ఉన్నారు. అయితే A11 నుండి A18 వరకు అల్లు అర్జున్‌ తో పాటు ఆయన బృందానికి సంబంధించిన వారిగా పోలీసులు పేర్కొన్నారు.

అల్లు అర్జున్‌ A11గా ఉన్నారు. ఆయన పర్సనల్ అసిస్టెంట్‌ సంతోష్‌ (A12), మేనేజర్ శరత్ చంద్ర నాయుడు (A13), బౌన్సర్ పర్వేజ్‌ (A17), మైత్రి మూవీ మేకర్స్‌ (A18) నిందితులుగా ఉన్నారు. ఈ కేసు కారణంగా అల్లు అర్జున్‌ బృందానికి తీవ్ర ఒత్తిడి కలుగుతోంది. ఈ వివాదం పరిష్కారం కోసం నిర్మాత దిల్‌రాజు రాజకీయ నేత రేవంత్‌ రెడ్డిని కలుసుకుని చర్చలు జరపనున్నారని సమాచారం.

సంధ్య థియేటర్ కేసులో నిందితుల జాబితా:

A1: పెద్ద రామిరెడ్డి (సంధ్య థియేటర్ యజమాని)
A2: చిన్న రామిరెడ్డి (సంధ్య థియేటర్ యజమాని)
A3: సందీప్ ఎం
A4: సుమీత్ వినయ్ (భాగస్వామి)
A5: అగమతి వినయ్ (భాగస్వామి)
A6: అశుతోష్ రెడ్డి
A7: రెనుకా దేవి (భాగస్వామి)
A8: అరుణ రెడ్డి
A11: అల్లు అర్జున్
A12: అల్లు అర్జున్ పర్సనల్ అసిస్టెంట్ సంతోష్
A13: అల్లు అర్జున్ మేనేజర్ శరత్ చంద్ర
A17: పర్వేజ్ (బాడీగార్డ్)
A18: మైత్రి మూవీ మేకర్స్ (పుష్ప 2 నిర్మాతలు)

ALSO READ: Ambajipeta Marriage Band to Lucky Baskhar: Best Telugu small and mid-budget films 2024

Recent Articles English

Gallery

Recent Articles Telugu