
Rajinikanth real name:
సినిమా ఇండస్ట్రీలో పేరు మార్చుకోవడం కొత్తేమీ కాదు. కొంతమంది ప్రజల్లో గుర్తింపు పొందడానికి మారుస్తే, మరికొందరు అదృష్టం కోసం లేదా వ్యక్తిగత కారణాల వల్ల కొత్త పేర్లను ఎంచుకుంటారు. తాజాగా, బాలీవుడ్ నటుడు ప్రతీక్ బబ్బర్, తన తల్లి స్మితా పాటిల్ పేరు జోడించి ప్రతీక్ స్మితా పాటిల్ గా మారాడు. తల్లికి మరింత దగ్గరగా ఉండడమే తన పేరు మార్పు వెనక ఉన్న ముఖ్యమైన కారణమని ఆయన తెలిపారు.
ఇక అక్షయ్ కుమార్ అసలు పేరు రాజీవ్ హరి ఓం భాటియా. కెరీర్ మొదట్లో మంచి గుర్తింపు కోసం అక్షయ్ అని మార్చుకున్నాడు. అజయ్ దేవ్‌గన్ అసలు పేరు విశాల్ వీర్ దేవ్‌గన్ కాగా, తన స్క్రీన్ ప్రెజెన్స్ కు తగ్గట్లు పేరు మార్చుకున్నాడు. కియారా అద్వాణీ అసలు పేరు ఆలియా అద్వాణీ, కానీ ఆలియా భట్ అప్పటికే స్టార్ కావడంతో, కొత్త పేరును ఎంచుకుంది.
బాలీవుడ్ లోనే కాదు, టాలీవుడ్, కోలీవుడ్ లో కూడా పేర్లు మార్చుకోవడం జరుగుతూ ఉంటుంది. రజినీకాంత్ అసలు పేరు శివాజీ గైక్వాడ్, కానీ దర్శకుడు కే బాలచందర్ ఇచ్చిన “రజినీకాంత్” పేరుతో చరిత్ర సృష్టించాడు. చిరంజీవి అసలు పేరు శివ శంకర వర ప్రసాద్, అయితే సినిమా ప్రపంచంలో శక్తివంతమైన పేరు కావాలని “చిరంజీవి”గా మార్చుకున్నాడు.
కొంతమంది పేరు మార్పు వెనక న్యూమరాలజీ నమ్మకం ఉండగా, మరికొందరు బ్రాండ్ విలువ కోసం మార్చుకుంటారు. కానీ చివరికి, ఒక పేరు కంటే టాలెంట్, కష్టపడి పనిచేయడం అన్నివంటివే వారిని స్టార్ లుగా నిలిపేలా చేస్తాయి.