
Indians who won Miss World title till now:
హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ 2025 జరగబోతుండటం చాలా ప్రత్యేకమైన విషయం. ప్రపంచ వ్యాప్తంగా అందాల రాణులు మే 6, 7 తేదీల్లో నగరానికి రానున్నారు. మే 31న హిటెక్స్‌లో గ్రాండ్ ఫినాలే జరగనుంది. ఈ సందర్భంగా ఇప్పటి వరకు భారత్ నుంచి మిస్ వరల్డ్ గెలిచిన అందాల రాణుల గురించి తెలుసుకుందాం.
భారతదేశం నుండి మిస్ వరల్డ్ విజేతలు:
✅ రీతా ఫరియా (1966) – మిస్ వరల్డ్ కిరీటం గెలుచుకున్న తొలి భారతీయురాలు. ఆమె గ్లామర్ ప్రపంచాన్ని వదిలేసి వైద్య రంగంలో కెరీర్ కొనసాగించారు.
✅ ఐశ్వర్య రాయ్ బచ్చన్ (1994) – బాలీవుడ్‌ను శాసించిన నటి. ఇంటర్నేషనల్ బ్రాండ్స్‌కు అంబాసిడర్‌గా నిలిచారు. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో రెగ్యులర్‌గా కనిపిస్తూ వస్తున్నారు.
✅ డయానా హెడెన్ (1997) – హైదరాబాద్ నుంచి వచ్చిన ఈ అందగత్తె నటిగా, రచయితగా పేరు తెచ్చుకుంది. ‘ది బ్యూటిఫుల్ ట్రూత్’ అనే పుస్తకాన్ని రాశారు.
✅ యుక్తా ముక్హే (1999) – కొంత కాలం సినీ పరిశ్రమలో కనిపించినా, పెద్దగా గుర్తింపు పొందలేకపోయారు.
✅ ప్రియాంక చోప్రా (2000) – బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకూ తనదైన ముద్ర వేశారు. ‘క్వాంటికో’ వెబ్‌సిరీస్, ‘డాన్ 2’ చిత్రాలతో పేరు తెచ్చుకున్నారు.
✅ మానుషి చిల్లర్ (2017) – వైద్య విద్య చదువుతున్న ఆమె మిస్ వరల్డ్ గెలిచిన తర్వాత సినిమాల్లోకి ప్రవేశించారు. ‘సమ్రాట్ పృథ్వీరాజ్’లో అక్షయ్ కుమార్ సరసన నటించారు.
ఈసారి భారతదేశం తరఫున నందిని గుప్తా పోటీలో పాల్గొననున్నారు. ప్రస్తుతం మిస్ వరల్డ్ కిరీటాన్ని 2024 విజేత క్రిస్టినా పిజ్కోవా (చెక్ రిపబ్లిక్) ధరిస్తున్నారు. మిస్ వరల్డ్ 2025 టైటిల్‌ను భారత్ గెలుచుకుంటుందా? వేచి చూద్దాం!