Kantara to Hanuman: Unexpected Pan-India Blockbusters
ఈమధ్య చిన్న హీరోల నుంచి స్టార్ హీరోల దాకా అందరూ ప్యాన్ ఇండియా సినిమాల వెనకే పడుతున్నారు. భారీ బడ్జెట్లో పెట్టి బోలెడు భాషల్లో విడుదల చేసిన కూడా.. కొన్ని సినిమాలు కనీసం మంచి ఓపెనింగ్ కలెక్షన్లు కూడా సాధించలేకపోతున్నాయి. కానీ ఎటువంటి అంచనాలు లేకుండా.. కేవలం ఒక భాష ప్రేక్షకులను మాత్రమే టార్గెట్ చేస్తూ వచ్చిన సినిమాలు కొన్ని.. ఊహించిన విధంగా పాన్ ఇండియా సక్సెస్ కూడా అందుకున్నాయి. అలా అనుకోకుండా పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ అయిన కొన్ని సినిమాలు ఒకసారి చూద్దాం.
Manjummel Boys:
ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలైన ఈ మలయాళం సినిమా.. ఒక నిజ జీవిత ఘటన ఆధారంగా తెరకెక్కిన చిత్రం. తమిళనాడులో గుణ గుహల్లో ఇరుక్కుపోయిన ఒక వ్యక్తిని తన స్నేహితులు కాపాడడం ఈ సినిమా కథ. స్క్రీన్ ప్లే ఆద్యంతం ఆసక్తికరంగా ఉండడం.. పైగా నిజంగా జరిగిన కథ కావడంతో.. ఈ సినిమాకి మంచి క్రేజ్ లభించింది. పెద్దగా ప్రమోషన్స్ కూడా లేకపోయినా కూడా.. మలయాళం తోపాటు ఈ సినిమా మిగతా భాషలో కూడా భారీ బ్లాక్ బస్టర్ అయింది.
Premalu:
ఎటువంటి ట్విస్టులు లేకుండా అలా సరదాగా సాగిపోయే ఒక రొమాంటిక్ ప్రేమ కథ ఈ సినిమా. కానీ ఇలాంటి జోనర్లో ఒక మంచి సినిమా చూసి చాలాకాలం అవడం, ఈ కాలం యువతకి కనెక్ట్ అయ్యే కదా కావడంతో.. ప్రేమలు సినిమా మిగతా భాషల్లో కూడా భారీ విజయాన్ని సాధించింది.
Kantara:
రిషబ్ శెట్టి హీరోగా స్వీయ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా.. కర్ణాటక కల్చర్ కి దగ్గరగా ఉండే ఒక పూర్తి రూటెడ్ కథ. అయినప్పటికీ కన్నడ ప్రేక్షకులను మాత్రమే కాక.. మిగతా భాషల ప్రేక్షకులను కూడా ఈ సినిమా చాలా బాగా ఆకట్టుకుంది. కే జి ఎఫ్ తర్వాత కన్నడ నుంచి ప్యాన్ ఇండియా సక్సెస్ అందుకున్న సినిమా కాంతారా. ఈ సినిమాకి ప్రీక్వెల్ గా కాంతారా: చాప్టర్ 1 కూడా అ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
Karthikeya 2:
తెలుగులో సూపర్ హిట్ అయినా కార్తికేయ సినిమాకి సీక్వెల్ గా వచ్చిన ఈ చిత్రం కూడా పాన్ ఇండియా సక్సెస్ అందుకుంది. చిత్ర బృందం కూడా ఈ సినిమా నార్త్ బెల్ట్ లో భారీ విజయాన్ని అందుకుంటుంది అని ఊహించిఅందుకుంటుంది. కానీ మంచి స్క్రీన్ ప్లే, ఆసక్తికరమైన కథ, పైగా శ్రీ కృష్ణుడి ఆధారంగా తెరకెక్కిన సినిమా అవ్వడం ఈ సినిమాకి నార్త్ ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఈజీ అయింది.
Hanuman:
నిజానికి తెలుగులో కూడా ఈ సినిమా మీద భారీ అంచనాలు లేవు అనడంలో అతిశయోక్తి లేదు. ఎటువంటి స్టార్ క్యాస్ట్ లేకుండా.. కేవలం ఫుల్ లెన్త్ ఎంటర్టైన్మెంట్, అద్భుతమైన విజువల్స్, కట్టిపడేసే స్క్రీన్ ప్లే, రోమాలు నిక్కబడుచుకునేలా ఉండే క్లైమాక్స్ తో.. ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను మాత్రమే కాక మిగతా భాషల్లో కూడా మంచి సక్సెస్ అయింది.
ALSO READ: Telugu, Tamil heroes కి మధ్య పెద్ద తేడా ఇదే!