HomeOTTOTT releases this week: GOAT నుండి 35 దాకా ఈ వారం బోలెడు ఆసక్తికరమైన సినిమాలు

OTT releases this week: GOAT నుండి 35 దాకా ఈ వారం బోలెడు ఆసక్తికరమైన సినిమాలు

From GOAT to 35 - OTT releases this week
From GOAT to 35 – OTT releases this week

OTT releases this week:

ఈ వారం ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్‌లపై విడుదలవుతున్న చిత్రాలు చాలా ఆసక్తికరంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం:

GOAT:

తమిళ సూపర్‌స్టార్ విజయ్ హీరోగా నటించిన ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. స్పెషల్ యాంటీ-టెర్రరిజమ్ స్క్వాడ్ (SATS) లో ఉన్న వ్యక్తి తన పాత సహచరుల ద్వారా ఒక కీలక మిషన్ కోసం మళ్లీ రంగంలోకి దిగుతాడు. ఈ సినిమా మంచి థ్రిల్‌తో పాటు, మంచి యాక్షన్ సన్నివేశాలతో ప్రేక్షకులను అలరిస్తుంది.

35 Chinna Katha Kadu:

ఈ సినిమా ఒక తల్లి తన కొడుకు పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకోలేకపోయినప్పుడు ఎదుర్కొన్న సవాళ్లను చర్చిస్తుంది. కుటుంబం ఎలా ఆందోళనకు లోనవుతుందో ఈ కథలో ప్రధానంగా చూపిస్తారు. ఆహా ప్లాట్‌ఫారమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం ప్రేక్షకులు తప్పక చూడవలసిన చిత్రం.

Amar Prem ki Kahani:


ఇది భారతదేశంలో విడుదలైన గే ప్రేమ కథా చిత్రాలలో ఒకటి. జియో సినిమా లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం సమాజంలో ఇప్పటికీ ఒక ట్యాబూ గా భావించబడే విషయాన్ని చర్చిస్తోంది. ఈ చిత్రం OTTలో ఎంత మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.

Kalinga:

ఒక గ్రామాన్ని ఒక దెయ్యం, ఒక పురాతన శాపం వేదిస్తున్నప్పుడు, గ్రామ ప్రజలు ఎలా బతికే ప్రయత్నం చేస్తారో ఈ ఆహా ఒరిజినల్ రూరల్ థ్రిల్లర్ లో చూపిస్తారు. ఈ చిత్రం గ్రామీణ నేపథ్యంలో ఆసక్తికరమైన కథలను ఆస్వాదించే ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

The Platform 2:

ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. మొదటి భాగం మంచి విజయం సాధించిన తర్వాత, ఈ సీక్వెల్ కూడా మంచి అంచనాలను అందుకుంది.

Read More: Janaka Aithe Ganaka: చిన్న హీరోకి పెద్ద పరీక్ష పెడుతున్న దిల్ రాజు

Recent Articles English

Gallery

Recent Articles Telugu