హీరో మంచు విష్ణు నటిస్తున్న తాజా చిత్రం ‘జిన్నా’. ఇషాన్ సూర్య డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో సన్నీ లియోన్, పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలోని ఓ పాటను మంచు విష్ణు కూతుళ్లు అరియానా, వివియానా పాడారు. తాజాగా చిత్ర యూనిట్ ఆ పాటని విడుదల చేశారు.
‘స్నేహం’ అంటూ సాగే ఈ పాటకు భాస్కర పట్ల లిరిక్స్ అందించగా.. అనూప్ రూబెన్స్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. మంచు విష్ణు కూతుళ్లు పాడిన ఈ పాట సినిమాలో కీలక సందర్భంలో వస్తుందట. డా.మంచు మోహన్‌బాబు ఆశీస్సులతో అవ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి కొన వెంకట్ కథ, స్క్రీన్ ప్లే అందించి, క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.