రాజ్ తరుణ్ సినిమా ఇంకోటి ఆగిపోయిందా ??
నటించినవి నాలుగు సినిమాలే అయినా.. ఆ సినిమాల ద్వారా వచ్చిన పేరు కంటే తన బిహేవియర్ ద్వారా రాజ్ తరుణ్ కి వచ్చిన పబ్లిసిటీ ఎక్కువ. మనోడు “ఒక సినిమా సైన్ చేశాడు” అన్న విషయాన్ని జీర్ణించుకొనేలోపు మరో సినిమా ఆగిపోయింది అని వార్తలొస్తున్నాయి. లేడీ డైరెక్టర్ సంజనా రెడ్డి దర్శకత్వంలో రాజ్ తరుణ్ రోమాంటిక్ ఎంటర్ టైనర్ ఎనౌన్స్ అయ్యింది. ఈ విషయం విని రాజ్ తరుణ్ కి ఉన్న అతికొద్ది మంది అభిమానులు సంతోషించేలోపు అతగాడి మరో సినిమా ఆగిపోయిందని తెలిసింది.
రాజ్ తరుణ్ కథానాయకుడిగా “ఎకె ఎంటర్ టైన్మెంట్స్” బ్యానర్ లో “దొంగాట” ఫేమ్ వంశీకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం నుంచి దర్శకుడు వంశీకృష్ణ తప్పుకొన్నాడని, అందుకు రాజ్ తరుణ్ ఇన్వాల్వ్ మెంటే కారణమని తెలుస్తోంది. ఇప్పుడిప్పుడే హీరోగా నిలదొక్కుకొంటున్న రాజ్ తరుణ్ ఈ విధమైన ఇన్వాల్వ్ మెంట్ తో సినిమాలు పోగొట్టుకొంటుండడం అతని కెరీర్ కి ఎంతవరకూ మంచిదో చూడాలి!