సార్వత్రిక ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ బయోపిక్ యాత్ర, ఎన్టీఆర్ బయోపిక్ మహానాయకుడు సినిమాలు విడుదల అయ్యాయి. యాత్ర సినిమా ఫర్వాలేదనిపించినా.. స్క్రీన్ ప్లే స్లోగా ఉండటంతో థియేటర్లకు జనాలు రావడం లేదు. అటు మహానాయకుడు సినిమాకు ఇంచుమించుగా అలాగే ఉంది. బాలకృష్ణ సినిమా అంటే మాస్ లో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. మహానాయకుడు సినిమా విషయంలో అది పూర్తి విరుద్ధంగా మారిపోయింది. ఒక సాధారణ హీరో సినిమాకు వచ్చిన కలెక్షన్లు కూడా రావడం లేదు.
ఈ రెండు సినిమాలను వైసీపీ, టీడీపీలు ప్రిస్టేజ్ ఇష్యూ గా తీసుకున్నాయి. గుంటూరు జిల్లా నరసరావు పేటలో ఈ సినిమాను రెండు పార్టీలు ఉచితంగా ప్రదర్శించేందుకు సిద్ధం అవుతున్నాయి. ఈ సినిమా టికెట్స్ ను పార్టీ కార్యాలయంలో ఉచితంగా పంచిపెడుతున్నాయి. రండి ఉచితంగా సినిమా చూడండి అంటూ ప్రచారం చేస్తున్నాయి.